Movies

“రూలర్” రవికుమార్

Nandamuri balakrishnas next movie titled ruler directed by ravikumar

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈనెల్లోనే లాంఛనంగా ప్రారంభిస్తారు. జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. సి.కల్యాణ్‌ నిర్మాత. ఇదివరకు ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘జై సింహా’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ కొత్త సినిమా కోసం ‘రూలర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇటీవల సి.కల్యాణ్‌ ఈ టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో నమోదు చేయించినట్టు సమాచారం. బాలకృష్ణ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఆ పాత్ర స్వభావానికి, దూకుడుకీ ‘రూలర్‌’ అనే పేరు సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోంది. ఇందులో ఇద్దరు నాయికలకు చోటుంది. వారి పేర్లు త్వరలోనే ప్రకటిస్తారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించనున్నారు.