గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, ఆయా స్థానాల్లో విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని గ్రామగ్రామాన పఠిష్టం చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా గ్రామస్థాయిలో సమస్యలపై నేతలు దృష్టి సారించాలని పార్టీ అధినేత కోరినట్లు సమాచారం. గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేయాలని నేతలకు పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో తమకు ఎదురైన అనుభవాలను పవన్ కు వివరించారు.
గెలిచినా ఓడినా గ్రామస్థాయిలో బలంగా ఉండాలి
Related tags :