Movies

ఆరబోతలో తప్పేముంది

Nothing wrong with exposing says Sanam Shetty

తమిళంలో అంబులి, మాయై, విలాసం, కతం కతం వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు సనం శెట్టి. ఇప్పుడు ‘టికెట్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. గ్లామర్‌గా నటించడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతోంది ఈ సుందరాంగి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు తెలిసినంతవరకు సినిమా వేరు, వెబ్‌ సిరీస్‌ వేరు కాదు. ఇప్పుడు అంతా ఒక్కటిగా మారిపోయింది. కానీ ఆ చిత్రాలు విడుదలయ్యే ఫ్లాట్‌ఫామ్‌ మారింది అంతే. అందువల్ల ఒకేరమైన భావనతోనే నటిస్తున్నా. ఇక సినిమాలకు సెన్సార్‌ బోర్డు ఉంది. అందువల్ల అందాల ఆరబోత ఎక్కువైతే వెంటనే కత్తెర పడుతుంది. కొన్ని సన్నివేశాలను మ్యూట్‌ కూడా చేస్తారు. కానీ వెబ్‌ సిరీస్‌లకు ఇలాంటి అడ్డు ఉండదు. కథకు అవసరమైన గ్లామర్‌గా నటించవచ్ఛు అందుకే వెబ్‌ సిరీస్‌లో గ్లామర్‌తోపాటు, యువతను ఆకట్టుకునే డైలాగులు ఉంటాయి. అయినా అందాలు ఆరబోసి నటించడంలో తప్పేముంది. కథకు అవసరమైతే గ్లామర్‌గా నటించడానికి ఏ మాత్రం వెనకాడనని’ పేర్కొన్నారు.