ముంబయి ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ప్రపంచశ్రేణి బౌలరే అయినా అతడిలో ఇంకా అత్యుత్తమ ప్రదర్శన దాగి ఉందని పేర్కొన్నాడు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్. చెన్నైతో మ్యాచ్ అనంతరం యువీ చేసిన ఇంటర్వ్యూలో సచిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సీజన్‌లోని అన్ని మ్యాచుల్లో డెత్ ఓవర్లలో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా మెరుగైన గణంకాలు నమోదు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో చెన్నైపై నాలుగు ఓవర్లకు రెండు వికెట్లు తీసి 14 పరుగులే ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ వివరిస్తూ తన అభిప్రాయం తెలిపాడు. అనంతరం సచిన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ లెగ్‌స్పిన్నర్ రాహుల్ చాహర్‌ని మెచ్చుకున్నాడు. ‘నాలుగు ఓవర్లలో 13 డాట్ బాల్స్ వేసి 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇది అద్భుత ప్రదర్శన. అతడు మొదటి మ్యాచ్ ఆడకముందే జయవర్ధనేతో నా అభిప్రాయం పంచుకున్నా. ఆరు నుంచి పదిహేను ఓవర్ల మధ్య అతడి బౌలింగ్ ప్రదర్శన చాలా బాగుంది’ అని పేర్కొన్నాడు. జయవర్ధనే మాట్లాడుతూ.. రాహుల్ చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడని, అతడు బౌలింగ్ చేస్తున్నంతసేపు తమని ఒత్తిడికి గురిచేశాడని చెప్పాడు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అందుకున్న తర్వాత బుమ్రా మాట్లాడుతూ ఫైనల్‌లో చెన్నైపై గెలుపొందడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. ‘ఈ రోజు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. జట్టు విజయానికి దోహదపడినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని వివరించాడు. కాగా ఈ సీజన్ మొత్తంలో బుమ్రా 16 మ్యాచుల్లో 19 వికెట్లు తీసి 6.63 ఎకానమీ సాధించాడు.
బూమ్రా ఈజ్ ద బెస్ట్-సచిన్
Related tags :