Movies

శోభన్‌బాబు దాపరికాలు

Shoban Babu Secrets Even At Home

నటీనటులందరూ తాము చేస్తున్న చిత్రాల గురించి, ఒప్పుకున్న కథల గురించి ఇంట్లోవాళ్లకి చెప్తారు. అక్కినేనికి ఈ అలవాటు ఎక్కువ. కాని శోభన్‌బాబు తాను ఏ షూటింగ్‌కి వెళ్లినది, ఒప్పుకున్న సినిమా ఏమిటి- అన్న విషయాలు ఏనాడూ ఇంట్లో చర్చించలేదు. ‘‘నేను షూటింగ్‌కి వెళ్లడం, ఇంటికి రావడం తప్ప ఎక్కడ షూటింగు, ఎవరి షూటింగు? లాంటి విషయాలు కూడా ఇంట్లో చెప్పడం అలవాటు లేదు. వాళ్లకి అనవసరం అని నా అభిప్రాయం’’ అని చెప్పేవారు శోభన్‌బాబు.