నేటి నుండి తిరుమలలోని కారీరిష్ఠి యాగానికి ఏర్పాట్లు పూర్తి. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలోను, దేశంలోను సుభిక్షత నెలకొనాలని ఆకాంక్షిస్తూ తిరుమలలోని పార్వేట మండపం వద్ద మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు కారీరిష్ఠి యాగంను టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు అనుగుణంగా హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన ఋత్వికులు, వేద పండితులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మే 14 నుండి 18వ తేదీ వరకు ప్రముఖ పండితులు తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయంలో ఋష్యశృంగ శ్లోక పారాయణము, ఆస్థాన మండపంలో మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేయనున్నారు. అదేవిధంగా మే 13 నుండి 19వ తేదీ వరకు ప్రముఖ కళాకారులతో నాదనీరాజనం వేదికపై అమృతవర్షిణి రాగ ఆలాపన నిర్వహించనున్నారు.
తిరుమలలో కారీరిష్ఠి యాగం
Related tags :