ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందడుగు వేశారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు ఊర్మిళ, సన్నీ దేవోల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. అయితే మీకు కూడా ఆ ఆసక్తి ఉందా? అని మీడియా వర్గాలు అజయ్ దేవగణ్‌ను అడగ్గా ఆయన చెప్పిన సమాధానం నవ్వులు పూయిస్తోంది. ‘నాకు సిగ్గెక్కువ. రాజకీయాల్లోకి రాలేను. ఎందుకంటే ఓ నేత ఎక్కడుంటే అక్కడ జనాలు గుమిగూడుతుంటారు. నా చుట్టూ అంత మంది ఉంటే అసౌకర్యంగా ఉంటుంది. అయితే నాకు కెమెరా ముందు ఆ బెరుకుతనం లేదు. కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం నా ఉద్యోగానికి న్యాయం చేయలేను. రాజకీయాలనేది ప్రజల వృత్తి. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వారంతా తప్పకుండా ప్రజలతో మమేకం కావాలి. నాలాగా సిగ్గుపడుతూ కూర్చుంటే మంచి రాజకీయ నాయకుడు కాలేరు. ఊర్మిళ, సన్నీ దేవోల్‌కు నా విషెస్ తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారంటే తప్పకుండా వారు మంచి ఆలోచనలతో ఉండుంటారు. ప్రజలు కోరుకుంటున్న మార్పులు వారు తీసుకొస్తారని ఆశిస్తున్నాను’ అని వెల్లడించారు అజయ్. ప్రస్తుతం ఆయన ‘దే దే ప్యార్ దే’ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అకీవ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, టబు కథానాయికలుగా నటించారు. 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఛీ పాడు…నాకు సిగ్గు బాబోయి
Related tags :