ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైన తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి 10,000 డాలర్లను ఖర్చుల కింద ఇస్తుంది. అమెజాన్ డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. అలా రాజీనామా చేసిన ఉద్యోగికి మూడునెలల వేతనాన్ని కూడా ఇచ్చేస్తారు. అమెజాన్ డెలివరీ సమయాన్ని రెండు రోజుల నుంచి ఒక్కరోజుకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాజీనామా చేసిన ఉద్యోగులు నీలిరంగ్ వ్యాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనిపై అమెజాన్ స్మైలీ బొమ్మను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను ఎంత మంది స్వీకరిస్తారనే అంచనాలు ఉన్నయో మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు డెలవరీలకు యూపీఎస్, పోస్టాఫీసులు, కొరియర్లను అమెజాన్ నమ్ముకొంది. ఈ పథకంలో అమెజాన్‌కు మరో కీలకమైన ఖర్చు తగ్గుతుంది. వాహనాలు, పనివారిని పెట్టుకోవడం వంటి ఖర్చులు కలిసొస్తాయి.
ఉద్యోగం మానేయండి-డబ్బులు తీసుకోండి
Related tags :