ప్రస్తుతం తానున్న స్థాయిలో వెంట వెంటనే సినిమాలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు బాలీవుడ్ నటి అనుష్క శర్మ. ఆమె చివరిగా నటించిన చిత్రం ‘జీరో’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత ఇప్పటివరకు అనుష్క ఒక్క సినిమాకు కూడా సంతకం చేయలేదు. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతూ ఎంజాయ్ చేశారు. అయితే ‘జీరో’ తర్వాత మరో చిత్రానికి ఎందుకు సంతకం చేయలేదు? అన్న ప్రశ్నకు అనుష్క సమాధానమిస్తూ..‘గత మూడేళ్లలో నేను ఫ్యాషన్ పరంగా ఎంతో కఠినమైన పని చేశాను. ఛాలెంజింగ్ పాత్రలున్న సినిమాల్లో నటించాను. ఏడాదిలో ‘పరి’, ‘సుయీ ధాగా’, ‘జీరో’ లాంటి సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం. ప్రస్తుతం నేనున్న స్థాయిలో సమయం వృథాకాకుండా ఉండటానికి సినిమాలకు సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఓ నిర్మాతగా నాకు చేతినిండా పని ఉంది. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాం. వాటికి కూడా నా సమయాన్ని కేటాయించాలి. అయితే ఓ నటిగా మాత్రం నేను తెర వెనుక చేసే పని గురించి ప్రజలకు తెలీకపోవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలతో సంతృప్తిగా ఉన్నాను. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి విభిన్నమైన పాత్రలను ఎంపికచేసుకున్నాను’ అని వెల్లడించారు అనుష్క.
నాకు సినిమాలు అక్కర్లేదు
Related tags :