అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. కారు ఢీకొట్టడంతో బొంగుల సాహిత్ రెడ్డి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో ఎంఎస్ చేసేందుకు వెళ్లి రహదారి ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సాహిత్ రెడ్డి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, లక్ష్మీ నల్లకుంటలోని పద్మా కాలనీలో నివాసం ఉంటున్నారు. తమ పెద్ద కుమారుడి మృతితో కుటుంబసభ్యులు తీరని దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉత్తర కరోలినా కారు ప్రమాదంలో బొంగుల సాహిత్‌రెడ్డి దుర్మరణం
Related tags :