కాశాపేట గ్రామం వద్ద 36వ రాష్ట్ర రహదారిపై రైతులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలను నిలిపేందుకు రహదారికి అడ్డంగా నాటుబండ్లను, కర్రలను అడ్డంగా వేశారు. సుమారు అరగంట పాటు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
విజయనగరం రైతులు జాతీయ రహదారిని బంధించారు
Related tags :