మీరు వాట్సాప్ వాడుతున్నారా. అయితే జాగ్రత్త. మీ వాట్సాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇజ్రాయిల్ హ్యాకర్లు వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారు. మెసేజింగ్ యాప్‌ను హ్యాక్ చేసి దాంట్లో నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఫోన్లతో పాటు ఇతర్ డివైస్‌లలోనూ హ్యాకింగ్ జరుగుతున్నది. టార్గెట్ చేసిన యూజర్లను మాత్రమే హ్యాక్ చేస్తున్నట్లు తాజాగా గుర్తించారు. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు పసికట్టారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారు. అయితే యూజర్లంతా తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సోమవారం రోజున వాట్సాప్ కోరింది. వాయిస్ కాలింగ్ ఫంక్షన్ ద్వారా టార్గెట్ యూజర్లను హ్యాక్ చేస్తున్నట్లు ఈనెలలోనే ఇంజినీర్లు గుర్తించారు. ఒకవేళ వాయిస్ కాల్‌కు స్పందించకున్నా.. నిఘా సాఫ్ట్‌వేర్ మాత్రం ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతోంది. ఆ కాల్‌కు సంబంధించిన డేటా కూడా ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతోంది. ఐఫోన్‌తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్‌లో తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ సంస్థ ఇంజినీర్లు పనిచేస్తున్నారు.
అర్జెంటుగా వాట్సాప్ అప్‌డేట్ చేసుకోండి
Related tags :