ScienceAndTech

భారతదేశంలో వాట్సాప్ దుర్వినియోగం

WhatsApp Abused By Indian Politicians

ఇప్పటికే హ్యాకింగ్‌ బారినపడి కోలుకొంటున్న వాట్సాప్‌కు భారత్‌లో మరో షాక్‌ తగిలింది. కేవలం 14డాలర్ల విలువైన ఒక టూల్‌ సాయంతో సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్‌ను విచ్చలవిడిగా వాడుకొంటున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ పేర్కొంది. సాధారణంగా వాట్సాప్‌ నుంచి ఒక సందేశాన్ని ఒకేసారి ఐదుగురు కంటే ఎక్కువ మందికి ఫార్వర్డు చేయడానికి అవకాశం లేదు. కానీ ఈ టూల్‌ను వాడుకొని ప్రధాన రాజకీయ పార్టీలు, డిజిటల్‌ మార్కెటింగ్‌లోని వారు భారీగా సందేశాలను పంపిస్తున్నారు. మొత్తం మూడు రకాలుగా భారత్‌లో వాట్సాప్‌ను దుర్వినియోగపరుస్తున్నట్లు ఈ కథనంలో వెల్లడించింది.
* ఉచిత క్లోనింగ్‌ యాప్స్‌ను వాడుకొని రాజకీయపార్టీల వారు భారీ సంఖ్యలో సందేశాలను పంపతున్నారు.
* సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను వాడుకొని నిరంతరాయంగా సందేశాలను పంపడం.
* కొన్ని వెబ్‌సైట్లలో లాగిన్‌ అయి భారీ సంఖ్యలో వాట్సాప్‌కు సందేశాలు పంపడం వంటివి చేస్తున్నారు.
భారత్‌లోని ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వెబ్‌సైట్లో ఇటువంటివి దాదాపు మూడు వరకు టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేస్తే డెలివరీ సమయంలో ఎటువంటి బ్రాండ్‌ పేరును దీనిపై ఉంచరు. దీనిపై వ్యాఖ్యనించేందుకు వాట్సాప్‌ నిరాకరించింది. ‘‘ నిబంధనలు ఉల్లంఘించి భారీ సంఖ్యలో సందేశాలు పంపినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటాము’’ అని వాట్సాప్‌ పేర్కొంది.