ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తారు కథానాయిక కాజల్ అగర్వాల్. ఇలా తన నటనతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ, మధ్య మధ్యలో హిందీలోనూ అలరిస్తూ కెరీర్‌లో 50 చిత్రాల మైలురాయిని కూడా దాటేశారు. కోలీవుడ్, టాలీవుడ్… వీటిలో ఏ ఇండస్ట్రీ మీ ఫేవరెట్ అన్న ప్రశ్నను కాజల్ ముందుంచితే… ‘‘రెండు ఇండస్ట్రీల్లో నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. రెండింటినీ సమానంగానే చూస్తాను. కానీ నేను ఇలాంటి విషయాలకన్నా నా పాత్రల ఎంపికపై ఎక్కువ దృష్టిపెడతాను. నాకు సూట్ అయ్యే పాత్రలు చేస్తున్నానా? అవి ఆడియన్స్‌కు ఎంత నచ్చుతున్నాయి? నటిగా నేను మెరుగుపరచుకోవాల్సిన అంశాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? అనే విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను.ఫలానా పాత్రలో కాజల్ బాగా నటించింది అని ఆడియన్స్ అంటే ఆ మాటే చాలు నాకు. వారి మెప్పు కోసం ఎంతైనా కష్టపడతాను’’ అని అన్నారు. తమిళంలో ‘కోమలి’, ‘ప్యారిస్ ప్యారిస్’, తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’, శర్వానంద్‌తో ఓ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారామె. కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో హీరోయిన్‌గా ఎంపికైన కాజల్ తెలుగు సినిమా ‘మను చరిత్ర’కు ఓ నిర్మాత. నిర్మాణ రంగంలోకి కాజల్ ఎంట్రీ ఈ చిత్రంతోనే.
నిర్మాణ రంగంలోకి
Related tags :