ఇటీవల జర్మనీకి చెందిన పరిశోధకులు పలు దేశాల్లో ఆల్కహాల్ వినియోగంపై అధ్యయనం చేశారు. అందులో మనం దేశం కూడా ఉంది. మన దేశంలో గత ఏండేండ్ల కాలంలో ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా పెరిగినట్టు ఆ అధ్యయనం చెపుతున్నది.జర్మనీలోని టీయూ డ్రెస్డెన్‌కు చెందిన పరిశోధకులు ఇటీవల 189 దేశాల్లో సర్వే నిర్వహించారు. ఏ దేశంలో ఆల్కహాల్ వినియోగం ఎంత ఉందనేది ఈ సర్వే సారాంశం. 189 దేశాల్లో 1990 నుంచి 2017 మధ్య ఆల్కహాల్ వినియోగ లెక్కలను తీశారు. ఈ లెక్కల ద్వారా 2010-2017 మధ్య కాలంలో మన దేశంలో 38శాతం వినియోగం పెరిగిందని తేలింది. ఒక వ్యక్తి 4.3 నుంచి 5.9 లీటర్లు సేవిస్తున్నాడని ఈ నివేదిక తెలుపుతున్నది. అదే అమెరికాలో అయితే ఒకరు ఏడాదికి సగటున 9.8 లీటర్ల మద్యం తాగుతున్నారు. చైనాలో 7.4 లీటర్లు తాగుతున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆల్కహాల్ వినియోగం 70శాతానికి పెరిగింది. 1990లో 20,999 మిలియన్ లీటర్లు తాగితే 2017లో 36,757 మిలియన్ లీటర్లు తాగారని ఆ నివేదిక స్పష్టం చేసింది
సగటు భారతీయుడు జుర్రేసే మద్యం-6లీటర్లు
Related tags :