* నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కమల్ హాసన్ ప్రస్తుతం వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన ఓ ప్రచారంలో మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. దీంతో కమల్‌పై సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ శ్రేణులు కూడా కమల్ వ్యాఖ్యలని తప్పు పట్టారు. అయితే బుధవారం రోజు కమల్ మధురైలోని తిరుప్పరకుంద్రం రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో 11 మంది వ్యక్తులు కమల్‌పై చెప్పులు వేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికలకి దూరంగా ఉండగా, అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతున్నాడు.
* మందు తాగి వేధిస్తున్నాడని కన్న కొడుకుని కడతేర్చిన సంఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదులు వివరాలు.. జవహర్ నగర్, వంపుగూడలో ఉండే పెరుపల్లి శ్రీనివాస్(45), భార్య మణెమ్మ కాప్రా మున్సిపాలిటీలో స్వీపర్లు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతరు. పెద్ద కొడుకు సాయి కుమార్(25) పేయింటర్. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై తల్లిదండ్రులను వేధించసాగాడు. గతనెల 25న శ్రీనివాస్, మణెమ్మల పెండ్లి రోజు కావడంతో కూతరు లావణ్య పుట్టింటికి వచ్చి మరుసటి రోజు వెళ్లిపోయింది.26 మధ్యాహ్నం సాయి మద్యం మత్తులో తల్లిని కొట్టాడు. రోజు రోజుకు సాయి ఆగడాలు పెరిగిపోవడంతో తల్లిదండ్రులు అతన్ని హతమారుద్దామని నిర్ణయించుకున్నారు. డ్రైవర్గా పనిచేసే సాయి సోదరుడు సందీప్ తల్లిదండ్రులు అనుకునే మాటలు విన్నాడు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సందీప్తన స్నేహితులు ఫయాజ్, ఇబ్రహీంలతో కలిసి ఇంటికి వచ్చాడు. సాయిని చంపేస్తే ఎంత డబ్బయినా ఇస్తామని శ్రీనివాస్, మణెమ్మలుచెప్పారు. దీంతో సందీప్అతని స్నేహితులు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో సాయి కుమార్ను వంపుగూడ, బ్యాంక్కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బీరు బాటిల్తో తలపై కొట్టి బండరాళ్లతో చంపేశారు.
* భార్యాపిల్లలు బాగుండాలని ఎక్కడో యూఏఈ వెళ్లి కష్టపడుతున్నాడు భర్త. నెలనెలా డబ్బులు పంపిస్తున్నాడు. కానీ భార్యేమో పాత ప్రియుడికి దగ్గరైంది. భర్తను సైడ్ చేసి ప్రియుడిని పెళ్లిచేసుకోవాలనుకుంది. భర్త సంతకాన్నీ ఫోర్జరీ చేసి మరీ విడాకులు తీసుకుం ది. లవర్‌ను పెళ్లి చేసుకుని పరారైంది. పోతూపోతూ సొంతిల్లును అమ్మిడబ్బులు తీసుకెళ్లింది. భర్త చీటింగ్ కేసు పెట్టడంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. యుసుఫ్ షెరిఫ్ మస్తాన్, నిలోఫర్ దంపతులు ముంబైలో ఉంటున్నారు. వాళ్లకు తొమ్మిదేళ్ల కొడుకున్నాడు. పని కోసం మస్తాన్ 2007లో యూఏఈ వెళ్లాడు . అక్కడ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఖర్చులకు డబ్బులు పంపడంతో పాటు ముంబ్రాలో ఓచిన్న ఇల్లు కొనడానికీ సేవ్ చేశాడు. కానీ పాతబాయ్ ఫ్రెండ్ కు నీలోఫర్ దగ్గరైంది. తన పేరుతో ఇల్లు కొనమని ఒత్తిడి చేయడంతో మస్తాన్ రూ.23లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు.ఈ క్రమంలో ఓసారి ఇండియా వచ్చి నప్పుడు భార్య ప్రవర్తనలో తేడా గమనించాడు. తర్వాత యూఏఈ వెళ్లిన మస్తాన్ 2017లో ఇండియా వచ్చినప్పుడు అంతా అర్థమైంది. తాను కొన్న ఇంట్లో వేరే ఎవరో ఉన్నారు.ఎంక్వైరీ చేస్తే రూ.32 లక్షలకు ఇంటిని నీలోఫర్ అమ్మేసిందని తెలిసింది. భర్త సంతకాన్ని ఫోర్జరీచేయడం, విడాకులిప్పించడంలో ఓ లాయర్ సాయపడ్డట్టు వెల్లడైంది. భార్యపై ఫోర్జరీ కేసు పెట్టాడు మస్తాన్. 2017 ఏప్రిల్‌లో మస్తాన్ డివోర్స్ పేపర్లపై సంతకం చేసినట్టు ఉందని, కానీ అతని వీసా ప్రకారం యూఏఈలో ఉన్నట్టు వెల్లడైందని, ఇది పక్కా ఫోర్జరీ అని పోలీసులు చెప్పారు.
* హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ జిల్లాలోని నాగ్ని గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. 45 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన మండి జిల్లాలోని సిరాజ్ వ్యాలీలో జీపు అదుపుతప్పి లోయలో పడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
* కమల్ హాసన్ పై చెప్పులతో దాడి
నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కమల్ హాసన్ ప్రస్తుతం వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన ఓ ప్రచారంలో మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని అన్నారు. దీంతో కమల్‌పై సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి.
బీజేపీ శ్రేణులు కూడా కమల్ వ్యాఖ్యలని తప్పు పట్టారు. అయితే బుధవారం రోజు కమల్ మధురైలోని తిరుప్పరకుంద్రం రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో 11 మంది వ్యక్తులు కమల్‌పై చెప్పులు వేసినట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికలకి దూరంగా ఉండగా, అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతున్నాడు.
* తనపై అసభ్య ఆరోపణలు చేసిన వారిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్న లక్ష్మీ పార్వతితనపై అసభ్య ఆరోపణలు చేసిన వాడిని తంతే వెనకున్న టీడీపీ నేతలు బయటకు వస్తారన్నారు లక్ష్మీ పార్వతి. సోషల్ మీడియా వేదికగా లక్ష్మీ పార్వతిపై ఓ వ్యక్తి ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు. తనపై అసభ్య ఆరోపణలు చేసిన వ్యక్తికి సరైన శిక్ష పడాలని వైసీపీ నేత లక్ష్మీపార్వతి కోరారు. సోషల్ మీడియా వేదికగా నటి పూనం కౌర్, లక్ష్మీపార్వతిపైనా అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఒకరేనని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కానీ నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే అతని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని లక్ష్మీ పార్వతి చాలా గట్టిగా వాదిస్తున్నారు.తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన నిందితుడిని అరెస్టు చేసి, నాలుగు తంతే, దీని వెనుక ఉన్నదెవరో బయటకొస్తుందని అన్నారు. అది టీడీపీనేనని ఆమె అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబువల్ల ఎన్నో భరించానని ఆమె చెప్పుకొచ్చారు. ఒక తల్లి వయసు ఉన్న తాను ఓ బిడ్డ లాంటి వాడికి మెస్సేజ్ లు పంపించానంటే ఎవరైనా నమ్మే విషయమేనా? అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు నీచుడని, మొదటి నుండి ఎన్నో అవమానాలు చేశారని ఆమె అన్నారు. ఒక తల్లి లాంటి వ్యక్తిని బజారులో పెట్టాలనుకున్న నీచుడికి సరైన శిక్ష పడాలని కోరారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన నిందితుడు నివసించే గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నానని, అతన్ని పోలీసులు పట్టుకునేందుకు సహకరించాలని లక్ష్మీ పార్వతి కోరారు.
* న్యూయార్క్ లోని హడ్సన్ నదిలో ఓ హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన నిన్న జరిగింది. మాన్‌హట్టన్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరూ మరణించడం గానీ తీవ్రగాయాలపాలవడం గానీ జరగలేదు. కాగా పైలట్, డాక్ వర్కర్‌కు మాత్రం స్వల్ప గాయాలైనట్లు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ అదుపుతప్పిన హడ్సన్ నదిలో పడిపోవడాన్ని చూసిన పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
*సోషల్ మీడియా క్రైంకు కేరాఫ్ గా మారుతోంది. పేస్ బుక్ , ట్విట్టర్ నకిలీ ప్రోఫైల్స్ తో కేతుగల్లు వల వేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ తో ఇల్లిగాల్ పనులు చేస్తున్నారు. టీనేజ్ సాఫ్ట్ వేర్ యువతులు సొసైటీతో హోదాలో ఉన్న మహిళలను నకిలీ ప్రోఫైల్స్ తో ట్రాప్ చేస్తున్నారు. అసభ్య మెసేజ్ లు పెడుతున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అందినకాడికి లాగుతున్నారు. మరోలా కసి తీర్చుకుంటున్నారు. సైబర్ క్రైం కేతుగాళ్ళూ దెబ్బకు కొందరు డబ్బు పోగొట్టుకుంటే, మరికొందరికి మనశ్శాంతి కరువైతే, ఇంకొందరికాపురాలే కూలిపోయాయి. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల ఫొటోలూ మార్ఫ్ చేసి వైరల్ చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫొటో మార్ఫింగ్ కేసూ దుమారం రేపుతోంది.
* రాష్ట్రంలోని పుల్వామాలోని డాలిపోరా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఆయుధాలతో దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి చెందగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. పారిపోయిన ముష్కరుల కోసం దళాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు.
* బెజవాడలో వీసా పేరిట మోసంఆస్ట్రేలియాలో వీసా ఇప్పిస్తామని 9 లక్షలు వసూలు6 నెలలు గడిచినా వీసా ఇప్పించక పోవటంతో బయటపడ్డ మోసంగ్లోబల్ ట్రీస్ కన్సల్టెన్సీపై బెజవాడ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలుసీపీ ఆదేశాలతో కన్సల్టెన్సీపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు
* నకిలీ పోలీసు ఆఫీసర్ అరెస్ట్ఆర్మీ, ఎన్ఐఏ, ఐపిఎస్ వేషాలతో బురిడిఫేక్ పోలీస్ కర్ణాటి గురు వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులునింధితుడి స్వస్థలం వైఎస్ఆర్ కడప జిల్లాసివిల్ సర్విసెస్ సాధించలేక ఫేక్ ఐపీఎస్ అవతారంనింధితుడి మీద గతంలోనూ ఇలాంటి కేసులునింధితుడి నుంచి డమ్మీ ఫిస్టోల్, ఫేక్ ఐడి కార్డ్స్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎన్ఐఏ, ఫేక్ రబ్బర్ స్టాంప్స్, ఎన్ఐఏ డైరీ, ఐపాడ్, ల్యాప్టాప్, డిఎమ్ఎస్ షూ, బైనాకులర్స్, సెల్ ఫోన్లు స్వాధీనంఐపీఎస్ అధికారినని చెప్పుకుని రైల్వే రిజర్వేషన్స్, కొన్ని పైరవీలు చేసే ప్రయత్నం.
* కొండపాక మండలం లకుడారం గ్రామంలో ఇద్దరు ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య. చేసుకున్నారు.కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం…లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య (21) రాచకొండ తారా (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే విషయంలో గ్రామ పెద్దలు కనకయ్యకు 30 వేల జరిమానా విధించారు. అయినప్పటికీ కనకయ్య ,తార ఒకరినొకరు ఇష్టపడుతూ వచ్చారు. కులాలు వేరు కావడంతో ఇరువురు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భవనంలోకి వెళ్లారు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన కనకయ్య తార ముందుగా వెంట తెచ్చుకున్న విషం తాగారు. అనంతరం పాఠశాల లోని ఓ గదిలోకి వెళ్లి ఓకే తాడుతో ఇద్దరు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల భవనం నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతుడు కనకయ్య పది రోజుల క్రితమే ఆంజనేయ స్వామి మాలను ధరించాడు. ఈ మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన కు తరలించారు.
*రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్న 11 వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలో ఎం.రామ్‌పూర్ సమితి నువముండొ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక దాదాపు 20 మంది మావోయిస్టులు రహదారి పనులు చేపడుతున్న క్యాంపునకు వచ్చారు. మొదట గుత్తేదారు గురించి వాకబు చేశారు. ఆయన లేరని చెప్పడంతో గొడ్డలితో ఓ వాహనం ఇంధన ట్యాంకు పగులగొట్టారు. ఆయిల్ ఇతర వాహనాలపై పోసి నిప్పంటించారు. ఘటనలో రెండు జేసీబీలు, ఓ ట్రాక్టరు సహా 11 వాహనాలు కాలిపోయాయి. అనంతరం రహదారి పనులను వ్యతిరేకిస్తూ ఈ చర్య చేపట్టినట్లు అక్కడ ఓ లేఖ వదిలి వెళ్లారు.
*సీపీఎం కార్యకర్తను హత్య చేసిన ఏడుగురు ఆర్‌ఎస్‌ఎస్, భాజపా కార్యకర్తలకు థలస్సేరి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం యావజ్జీవ శిక్ష విధించింది. తలో రూ.లక్ష జరిమానాగా చెల్లించాలని, ఇందులో సగం డబ్బును హతుడి భార్యకు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నవంబరు 6, 2007న నమతముక్కులో పారకండి పవిత్రన్ అనే సీపీఎం కార్యకర్తపై 8మంది దాడి చేయడంతో ఆయన చనిపోయాడు. నిందితుల్లో ఒకరు చనిపోవడంతో మిగిలిన ఏడుగురికి కోర్టు శిక్ష విధించింది.
*ఏసీ పేలడంతో ఏర్పడిన అగ్నిప్రమాదంలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. తమిళనాడులోని విళుపురం జిల్లా కావేరిపాక్కంకు చెందిన రాజు (60) స్థానికంగా వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తున్నారు.
*ఒకే ఆస్తిని పలు బ్యాంకుల వద్ద తనఖా పెట్టి పెద్దమొత్తంలో రుణం తీసుకొని ఎగ్గొట్టిన నేరంలో ఆరుగురు నిందితులకు జైలుశిక్ష విధిస్తూ సీబీఐ న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది.
*హైదరాబాద్‌లో మత్తుమందుల కలకలం చెలరేగుతూనే ఉంది. ఇటీవల నాచారంలో బెంగళూరు మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్.సి.బి.) అధికారులు మత్తుమందుల తయారీ కర్మాగారాన్ని కనుగొన్న ఉదంతం మరువక ముందే మళ్లీ బుధవారం మరో ముఠా గుట్టు రట్టయింది.
* ‘‘నేను బతకాలో, చనిపోవాలో మీరే చెప్పండి ప్లీజ్’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సలహా కోరి మరీ ఆత్మహత్య చేసుకుందో యువతి. తూర్పు మలేసియాలో 16 ఏళ్ల యువతి మే 13న ఆత్మహత్యకు పాల్పడింది.
*నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్యకేసులో నిందితుడు తిరునగరు శ్రవణ్‌కు సంబంధించిన మూడు ఉంగరాలు జిల్లా జైలులో మాయమయ్యాయి.
*క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పేరిట డిజిటల్ వాలెట్ ‘‘పేటీఎం’’లో రూ.5 నుంచి పది కోట్ల మోసం జరిగింది. చిన్న వ్యాపారులతో కలసి పేటీఎం కిందిస్థాయి ఉద్యోగులు కొందరు ఈ అవకతవకలకు పాల్పడ్డారని సంస్థ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో తేలింది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ (గతంలో ఎర్నెస్ట్ అండ్ యంగ్)తో పేటీఎం అభివృద్ధి పరిచిన సాఫ్ట్‌వేర్ వల్ల ఈ మోసం బయటపడింది.
* వైద్య కుసుమాన్ని సముద్రపు అలలు బలిగొన్నాయి. గోవా బీచ్‌లో మంగళవారం రాత్రి అలల తాకిడికి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువ వైద్యురాలు వూటుకూరి రమ్యకృష్ణ (26) దుర్మరణం పాలయ్యారు.
* బంధువుల ఇంటి వద్ద పెళ్లి పందిరి వేసేందుకు విద్యుత్తుతీగలు అడ్డు వస్తున్నాయని.. కరెంటును ఆపేందుకు ట్రాన్స్ ఫార్మర్ (నియంత్రిక) వద్దకు వెళ్లిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
*మద్యానికి బానిసగా మారిన కుమారుడి వేధింపులు తాళలేక.. తల్లిదండ్రులు కన్న ప్రేమను చంపుకొని అతడిని హత్య చేయించిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ ఠాణా పరిధిలో సంచలనం సృష్టించింది.
* గోవా బీచ్‌లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వైద్యురాలు ఊటుకూరు రమ్యకృష్ణ ప్రమాదవశాత్తు మృతిచెందారు. బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన కెరటాల్లో ఆమె కొట్టుకుపోయారు.
*సూర్యాపేట జిల్లా చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడెం వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
*ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజున జనసేన కార్యకర్తలపై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ఆరుగురు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని గంగవరంలో పోలింగ్ రోజున ఓ మహిళా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడి చేశారు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాటతో ఘర్షణ చెలరేగింది. ఈ కేసులో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్టు సమాచారం.
*ఏడాది కిందట ఇంట్లో పనికి కుదిరింది.. నాలుగు నెలలుగా ఇంట్లోని బంగారు, వజ్రాభరణాలను చక్కపెట్టుకొని.. పనిమానేసి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు పోలీసులను ఆశ్రయించగా నిందితురాలిని అరెస్టు చేసి ఆమె నుంచి రూ.30లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
* కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ప్లైఓవర్‌పై ఈరోజు ఉదయం రహదారి మరమ్మతులు చేస్తున్న కూలీలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
*టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేయడం కోసం, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం.
*గుప్త నిధుల కోసం వెళ్లిన ముగ్గురిలో ఒకరు మృత్యువాత పడగా, మరొకరు అదృశ్యమైన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం సృష్టించింది.
*మాదకద్రవ్యాల కేసుల దర్యాప్తులో మితిమీరిన అలసత్వంపై వస్తున్న విమర్శలు అధికారులలో కదలిక తెచ్చాయి.
* నకిలీ ఐపీఎస్ అధికారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి తుపాకీ, ల్యాప్‌ట్యాప్, రబ్బరు స్టాంపు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి ఎన్‌ఐఏ అదనపు ఎస్పీగా చెప్పుకుంటు తిరుగుతున్నాడు. నిందితుడు గురు వినోద్ ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వ్యక్తి. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. గురువినోద్ గతంలోనూ నకిలీ గుర్తింపు కార్డులతో కొందరిని బెదిరించి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ బెదిరింపులు, మోసాలకు పాల్పడ్డాడు. ఒక ఆర్మీ మేజర్ ఇంట్లో కొన్ని వస్తువులు చోరీ చేశాడు. యూనిఫామ్ అధికారి కావాలనేది నిందితుడి కోరిక. కానీ తప్పుడు దారిలో వెళ్లాడని సీపీ పేర్కొన్నారు.
*ఏపీలోని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లెలో అదృశ్యమైన ఇద్దరిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌లో కెనరా బ్యాంకు క్యాషియర్ కట్టా శివకుమార్‌గా గుర్తింపు. గుప్తనిధుల కోసం అన్వేషణలో ముగ్గురు వ్యక్తులు అటవీప్రాంతంలోకి వెళ్లారు. వీరిలో ఇద్దరు గుంటూరు జిల్లా కొల్లిపర మండలవాసులు కాగా మరొకరు హైదరాబాద్ వాసి. అడవీలోకి వెళ్లిన ముగ్గురిలో కృష్ణానాయక్ అనే వ్యక్తి సురక్షితంగా బయటికి వచ్చాడు. అగుపించకుండా పోయిన మరో వ్యక్తి హనుమంతనాయక్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
*పగిడ్యాల మండల పరిధి నెహ్రూనగర్ గ్రామ సమీపంలోని కృష్ణానదిలో ఈనెల 15న పశువుల కాపరి బోయ నాగన్న గల్లంతైన విషయం తెలిసిందే. గాలింపు చర్యలు చేపట్టడంతో గురువారం కృష్ణానదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. వ్యవసాయ పరపతి సంఘం ఛైర్మన్ శ్రీనివాసులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేసి కుటుంబసభ్యులను ఓదార్చారు. పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన వచ్చి సహాయం చేసేవాడని గ్రామస్థులు కంటతడి పెట్టారు. మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
*చైనాలోని షాంఘై నగరంలో భవనం కుప్పకూలింది. ఫైనాన్సియల్ హబ్ ప్రాంతంలో ఉన్న భవనం కూలిపోగా..భవన శిథిలాల్లో 20 మంది చిక్కుకున్నారు. రెస్క్యూటీం 11 మందిని సురక్షితంగా కాపాడింది. శిథిలాల్లో చిక్కుకున్న 9మందిని రక్షించేందుకు సుమారు 150 మంది రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. భవనం కుప్పకూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చైనాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
* మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని అర్జున్ కాలనీలో అమానుష సంఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి వివాహితతో పాటు చిన్నారిని తీసుకెళ్లాడనే నెపంతో అతడిని చెట్టుకు కట్టేసి కొట్టారు.
వ్యక్తి ఒక్కడినే కాదు.. మహిళతో పాటు మైనర్‌ను కూడా చెట్టుకు కట్టేశారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇటీవలే ఓ మహిళ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. అయితే ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయేందుకు సదరు వ్యక్తి సహకరించినట్లు తెలిసింది. కానీ ఆమెను బలవంతంగా అతను తీసుకెళ్లలేదు. దీనిపై విచారణ జరుపుతున్నాం. వ్యక్తిని కొట్టిన కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
* విజయవాడపోలీసులపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఫిర్యాదుపై సీపీ చర్యలుఎన్నికల్లో పెనమలూరు పోలీసులు వైసీపీకి సహకరించారని సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బోడెవిచారణ జరిపి స్టేషన్ లో ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్న సీపీ
* సామాన్యుడిపై తన ప్రతాపం చూపించాడు పోలీస్. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై కానిస్టేబుల్ శ్రీనివాస్ దాడి చేయడంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో నీకేందుకు అంటూ అతనిపై తన జులుం చూపించాడు కానిస్టేబుల్. ఓ వ్యక్తిపై దాడిని అడ్డుకున్న మరొకరి చెంప చెళ్లుమనిపించాడు కానిస్టేబ. ఇష్టం వచ్చినట్లు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కొట్టాడు. శ్రీనివాస్ తాండూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఈయన తీరుపట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* చైనాలోని షాంఘై నగరంలో భవనం కుప్పకూలింది.
ఫైనాన్సియల్ హబ్ ప్రాంతంలో ఉన్న భవనం కూలిపోగా..భవన శిథిలాల్లో 20 మంది చిక్కుకున్నారు.
రెస్క్యూటీం 11 మందిని సురక్షితంగా కాపాడింది. శిథిలాల్లో చిక్కుకున్న 9మందిని రక్షించేందుకు సుమారు 150 మంది రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. భవనం కుప్పకూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవల చైనాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కమల్‌పై చెప్పులతో దాడి-నేరవార్తలు–05/16
Related tags :