వేసవిలో ఉక్కబోతకు తోడు మెడపై జుట్టు పడుతుంటే చిరాగ్గా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు జుట్టుని బిగుతుగా పైకి ముడి పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. కానీ అలానే బయటకు వెళ్లలేం కదా! అందుకే దీన్ని ప్రయత్నించి చూడండి. ముందుగా జుట్టును చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి. తల మధ్య నుంచి పాపిట తీసి జుట్టుని రెండు భాగాలుగా విడదీయాలి. ఈ జుట్టుని రబ్బరు బ్యాండ్లతో పోనీల్లా వేసుకోవాలి. ఇప్పుడు కుడివైపున పోనీలోని జుట్టుని మళ్లీ రెండు భాగాలుగా విడదీసి ఒక్కో పాయను మెలితిప్పుతూ మరో పాయతో జతచేయాలి. అలా చివరివరకూ చేసి రబ్బరు బ్యాండు పెట్టుకోవాలి. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. ఈ రెండు జడల్ని ఒకదానిపై మరొకటి ఉంచి పైకి తెచ్చి వ్యతిరేక దిశలో ముడిలా వేసుకోవాలి. మధ్యలో కదలకుండా పిన్నులు పెట్టుకుంటే సరి.
జడ కట్టు…ముడి పెట్టు…చిరాకు హాంఫట్టు!
Related tags :