ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్)లు సంయుక్తంగా ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆట పాటలు, ఫ్యాషన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు, వేడుకల సమన్వ్యకర్త శీలం కృష్ణవేణిల ఆధ్వర్యంలో వనం జ్యోతి, మద్దూరి సంధ్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. నిఖిత నన్నపనేని ప్రారంభ గీతం “కమ్మనైన అమ్మ” ఆకట్టుకుంది. కల్పన ఉప్పలూరి శిష్య బృందం నృత్యం అలరించింది. అమ్మ, ఆప్యాయత, అనురాగం అనే అంశాలతో – ఇంటికి ఇల్లాలే దైవం అని, అందరికి కనిపించే దైవం అని, ఎన్ని వున్న అమ్మ ఆప్యాయతకు సరితూగవని అమ్మ గొప్పతనాన్ని వక్తలు కొనియాడారు. కీర్తి చామకూర, నిఖిత నన్నపనేనిల సంగీత విభావరి ఆకట్టుకుంది. గౌరి జున్నికర్, శ్రీ తిన్ననూరి మహిళల ఆరోగ్య, వాణిజ్యపరమైన సలహాలు ఇచ్చారు. శిల్ప ఖానోన్కర్ “సొగసు చూడతరమ” పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ ఫ్యాషన్ షోకు “సుందరాకాండ” హీరోయిన్ అపర్ణ హాజరయ్యారు. శ్రీలు మండిగ డ్యాన్సాక్షరి కార్యక్రమం వినోదం పంచింది. నటి అపర్ణను టాంటెక్స్ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం, మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉపాధ్యక్షురాలు పాలేటి లక్ష్మి, కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, శ్రీలు మండిగ, కళ్యాణి తాడిమేటి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. బసేరా విందు అలరించింది.
టాంటెక్స్-నాట్స్ మాతృదినోత్సవ వేడుకలు
Related tags :