రంజాన్ మాసంలో ఉపవాస విరమణ చేసిన తర్వాత ముస్లింలు మొదటగా తినే ఫలం ఖర్జూరా. ఈ మాసంలో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో విదేశాల నుంచి వెరైటీ ఖర్జూరాలను దిగుమతి చేసుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వీటికున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కొంతమంది వ్యాపారులు ఈ నెలలోనే ఖర్జూర పండ్లను అమ్ముతుంటారు కూడా. దీంతో ఓల్డ్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో వ్యాపారం జోరుగా సాగుతోంది. 100 నుంచి రూ.650 వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం ఖర్జూరాలు ఒక్కో ధరకు విక్రయిస్తారు.
*తక్షణ శక్తి కోసం స్వీకరణ
ఎండలు మండిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండే వారికి నీరసం, అలసట వస్తుంటాయి. రోజా విరమణ సమయంలో ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో రెండు రకాలుంటారు. ఒకటి ఎండినవి, రెండు పచ్చివి. ఇఫ్తార్‌లో బాగా మాగిన ఖర్జూరం పండ్లను ఆహారంగా తీసుకుంటారు. ఎండు ఖర్జూరాలను నేరుగా తినే అవకాశం ఉన్నా.. వీటిని ఎక్కువగా తీపి వంటల్లో వాడతారు. ఖర్జూరం పండ్లు తినడం వల్ల నీరసం పోయి తక్షణ శక్తి వస్తుంది. పోషక విలువలు అధికంగా ఉంటాయి. వంద గ్రాముల ఖర్జూర పండ్లలో 234 క్యాలరీల శక్తి ఉంటుంది. దీంతో పాటు విటమిన్ బి, 1.8 గ్రాముల ప్రోటీన్లు, 55.6గ్రాముల కార్బోహైడ్రెడ్లు, 0.5 గ్రాముల కొవ్వు, 4 మిల్లీ గ్రాముల సోడియం, 60.9 మిల్లీ గ్రాముల పొటాషియం, ఐరన్, 7.6గ్రాముల పీచు ఉంటాయి.
*అరబ్ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి
రంజాన్ సందర్భంగా ఖర్జూరాలను అత్యధికంగా సౌదీ, ఇరాన్, ఇరాక్ ల నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాలు ఆయా దేశాల్లోనే పండుతాయి. ఇరాక్‌తో పాటు ఖర్జూరాలు ఎక్కువ పండేది సౌదీ, యమన్, అల్జీరియా, మొరాకో లాంటి గల్ఫ్ దేశాలు. వీటిలో అనేక రకాలు ఉంటాయి. ప్రత్యేకంగా సౌదీలోని మదీనా సిటీలో వివిధ రకాలు లభిస్తాయి. పండ్లలోని తేమను బట్టి మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువ, రెండో రకం తిపి ఎక్కువ, తేమ ఎక్కువ, మూడో రకం తెమ తక్కువగా ఉండి తీపి ఎక్కువగా ఉంటాయి. రంగులతో పాటు రుచుల్లోనూ ఎన్నో రకాలు ఉంటాయి.
రంజాన్ ఉపవాస సమయంలో ప్రధాన ఆహారం-ఖర్జూరం
Related tags :