DailyDose

యాదాద్రిలో ముగిసిన జయంత్యుత్సవాలు

May 17 2019 - Daily Devotional News Telugu - Yadadri Jayanti Utsavam-tnilive-యాదాద్రిలో ముగిసిన జయంత్యుత్సవాలు

గత మూడ్రోజులుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న జయంతి ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఉదయం మహా పూర్ణాహుతిని ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్తి చేశారు. అనంతరం సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.వెయ్యి కలశాలను వరుస క్రమంలో పేర్చి.. మంత్రజలంతో ప్రత్యేక పూజలు చేశారు. వేదపారాయణాలు, రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య సహస్ర కలశాభిషేక ఘట్టాన్ని కన్నుల పండువగా చేశారు.సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలకు వైభవంగా పరిసమాప్తి పలికారు. రేపటి నుంచి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
1. బాసర అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీదేవి
బాసర అమ్మవారిని తెలంగాణ హైకోర్టు తొలి మహిళా అదనపు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి గురువారం దర్శించుకొన్నారు. ఆలయాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కుంకుమపూజ, మహాహారతి తదితర పూజలను చేశారు. జస్టిస్‌ శ్రీదేవికి నిర్మల్‌ జిల్లా పాలనాధికారి ప్రశాంతి, జిల్లా పోలీస్‌ అధికారి శశిధర్‌రాజులు అమ్మవారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. వేదపండితులు అమ్మవారి చరిత్రను వివరించారు.
2. యాదాద్రి ఉత్సవాల్లో కాళీయ అలంకరణ
యాదాద్రీశుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా, గురువారం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. లక్ష నామాల పఠనంతో కుంకుమార్చన చేపట్టి స్వామిని, అమ్మవార్లను ఆరాధించారు. కాళీయ మర్దనుడి అలంకరణతో స్వామిని ముస్తాబు చేశారు.ఉత్సవాల రెండో రోజున హోమాది పూజలు, మంత్రపుష్పం నిర్వహించారు. రాత్రి హనుమంత సేవోత్సవాన్ని చేపట్టారు. మృగ నరహరిని రామచంద్రమూర్తిగా తీర్చిదిద్ది, భక్తజనులకు దర్శనభాగ్యం కలిగించారు. ఆలయ సన్నిధిలో భజనలతో పాటు నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. పాత గుట్ట ఆలయంలోనూ సేవోత్సవాలు నిర్వర్తించారు.
3. 5 రోజుల్లో 4.39 లక్షల మందికి శ్రీవారి దర్శనం
తిరుమతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఈనెల 11 నుంచి 15 వరకు.. 5 రోజుల్లో 4.39 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులకు ఇబ్బందిలేకుండా అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో పని చేస్తున్నారని తితిదే పేర్కొంది. ఈనెల 11న 95,016, 12న 1,01,086, 13న 87,947, 14న 87,702, 15న 74,309 మంది చొప్పున దర్శించుకున్నట్లు తెలిపింది.
4. భద్రకాళి అమ్మవారికి మహాపూర్ణాహుతి
చారిత్రక ప్రాంతమైన వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ భద్రకాళి అమ్మవారికి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు మంత్రి ఎర్రబెల్లికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రకాళి మాతకు ఉదయం శరభవాహన సేవ, సాయంత్రం పుష్ఫరథ సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉభయదాతలుగా వెలమ సంక్షేమ సంఘం బాధ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ప్రసాద వితరణ చేశారు.
5. తిరుమల సమాచారం
ఈ రోజు శుక్రవారం 17.05.2019 ఉదయం 5 గంటల సమయానికి,
నిన్న 79,251 మంద భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం
స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 39 గదులలో భక్తులు
ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 18 గంటలు
శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం
నిన్న 38,549 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 4.10 కోట్లు.
6. చరిత్రలో ఈ రోజు మే, 17
సంఘటనలు
జననాలు
.1749: ఎడ్వర్డ్ జెన్నర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. (మ1823)
1906: శ్రీరంగం నారాయణబాబు, ప్రముఖ తెలుగు కవి (మ.1961).
1920: శాంతకుమారి, ప్రముఖ సినీ నటి (మ.2006).
1945: బి.ఎస్.చంద్రశేఖర్, భారత క్రికెటర్.
1986: ఛార్మి కౌర్, ప్రముఖ సినీ నటి.
మరణాలు
1971: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
1996: వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).
2007 : భారత దేశ కవి, రచయిత టి.కె.దొరైస్వామిమరణం (జ.1921)
2013: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి (జ.1962).
7. శుభమస్తు – నేటి పంచాంగం
తేది : 17, మే 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి
(ఈరోజు రా.తె. 3 గం॥ 35 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 50 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 36 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 6 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 16 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 3 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 41 ని॥ లకు.