*కేంద్రంలో భాజపేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కాషాయ పార్టీని వ్యతిరేకించే ఎ పర్తీనైనా తాము కలుపుకొని పోతామని, చివరికి టీఆర్ఎస్ వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. గ్రాండ్ అలయెన్స్ ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు శుక్రవారం దిల్లికి చేరుకున్నారు. సీపీఎం జనరల్ సెక్రటరి సీతారం ఏచూరి ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. కూటమి ఏర్పాటు పై చర్చించారు. సనివారం డిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహూల్ గాంధీని, లక్నోలో బీ ఎస్పీ చీఫ్ మాయావతిని కూడా చంద్రబాబు కలవనున్నారు. ఎపీలోని చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారం పై ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపేతర పార్టీలన్నింటిని కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. టీఆర్ఎస్ కలిసి వచ్చినా పని చేస్తారా అని మీడియా ప్రస్నిమ్చాగా, మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దని సూచించారు. భాజపాకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలిసి ముందుకు వెళ్తామని ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు ఎ పార్టీ వచ్చిన స్వాగతిస్తామని చెప్పారు.
*భాజపాకు అవకాశం సున్నా
ఈ ఎన్నికల్లో భాజపాకి సొంతంగా గానీ, ఎన్డీయేపక్షాలన్నిటికీ కలిపిగానీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రావని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయేలోలేని, ఇతర పార్టీల మద్దతు కూడగట్టినా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆయన తెలిపారు. తిరంగా ఛానల్‌లో ప్రసారమయ్యే అప్‌ఫ్రంట్ కార్యక్రమం కోసం ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ గురువారం చంద్రబాబుని ఇంటర్వ్యూ చేశారు.
*కేంద్రంలో ఎన్డీయేతర ప్రభుత్వం
కేంద్రంలో ఎన్డీయేలో లేని పార్టీలతో కూడిన ప్రత్యామ్నాయ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య భూమిక నిర్వహించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎంపికలోను కాంగ్రెస్ పాత్ర కీలకమవుతుందని ‘రాయిటర్స్’ ప్రతినిధికి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న అంశంపై తన మనసులో మాట బయట పెట్టేందుకు ఆయన నిరాకరించారు. ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకునేందుకు అవకాశం ఉన్నవారిలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా ఉంటారని మాత్రం ఆయన తెలిపారు.
* కాంగ్రెస్ కే మా మద్దతు దేవగౌడ
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవే గౌడ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దేవే గౌడ దర్శించుకున్నారు. దర్శన అనంతరం దేవే గౌడ మీడియాతో మాట్లాడారు. తాము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం. మే 23న ఫలితాలు వెల్లడి అయిన తర్వాత మిగతా విషయాలపై మాట్లాడుతానని.. అప్పటి వరకు ఏం మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. 23వ తేదీ తర్వాత దేశంలో ఏం జరగబోతుందనే త్వరలోనే చూడబోతున్నారని తెలిపారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే 21 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేసింది.
* కేసీఆర్, గవర్నర్‌పై వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు.
గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. ఇక అధికార అహంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హాజీపూర్ సమస్యను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. హాజీపూర్ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస జ్ఞానంలేదని ధ్వజమెత్తారు. బస్సు సౌకర్యం, వంతెన నిర్మించడంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు…
*నాలుగూ మనవే కావాలి
రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలనూ కైవసం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రసమితి పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆయా జిల్లాల మంత్రులతో సమావేశమై దీనికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేశారు. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ స్థానిక సంస్థల కోటా స్థానాలతో పాటు శాసనసభ్యుల కోటా కింద మరో స్థానంలో గెలిచి తమ బలాన్ని పెంచుకునేందుకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల కోటా కింద మూడు స్థానాలకు అభ్యర్థులుగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత తేరా చిన్నపరెడ్డిలు నామపత్రాలు దాఖలు చేశారు.
*వచ్చేది లౌకిక కూటమే
ఈసారి ఎన్నికల్లో లౌకిక కూటమి విజయం సాధించబోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎస్పీ, బీఎస్పీ, తెదేపా, టీఎంసీలు భాజపాకు మద్దతు ఇవ్వబోవన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలాతో కలసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో రాహుల్ మాట్లాడారు. మే 23న ప్రజల తీర్పు వస్తుందని, ఆ తరువాతే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఆలోచిస్తామన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మోదీ వదులుకున్నారన్నారు.
*‘సాధ్వి’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని భాజపా నాయకురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం సృష్టించింది. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ సభలో పాల్గొన్న ప్రధాని ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘‘ఇలాంటి వ్యాఖ్యలు ఖండించదగ్గవి. నాగరిక సమాజంలో ఇలాంటి భాష, భావాలకు చోటు లేదు. క్షమాపణలు చెప్పినప్పటికీ సాధ్విని నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా క్షమించను’’ అని అన్నారు. దీనికి అనుగుణంగానే శుక్రవారం ఆమె బుర్హన్‌పుర్‌లో రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉండగా, పార్టీ అనుమతి ఇవ్వలేదు. భోపాల్‌లో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞ గురువారం రోడ్‌షోలో మాట్లాడుతూ ‘‘గాడ్సే నిజమైన దేశభక్తుడు.
*ఇది పక్షపాత వైఖరి
ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలని, కొందరికి సహకరించటం, మరి కొంతమందికి అన్యాయం జరిగేలా ఏకపక్షంగా వ్యవహరించటం తగదని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లావాసాలను కలిశారు. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఏ ఆధారాలతో చంద్రగిరి నియోజకవర్గంలోని అయిదు బూత్‌ల్లో రీపోలింగ్‌కు ఆదేశించారో తెలపాలని నిలదీశారు.
*మోదీ నాయకుడు కాదు.. నటుడు
ప్రధాని నరేంద్రమోదీని ఓ ‘నటుడి’గా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ శుక్రవారం అభివర్ణించారు. ప్రధానమంత్రి పదవికి అమితాబ్ బచ్చన్ ఓ మంచి ఎంపిక అయి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ‘షోలే’ చలనచిత్రంలో అస్రానీ పాత్రతో కూడా ఆమె మోదీని పోల్చారు. ‘ప్రధాని ఓ నాయకుడు కాదు…నటుడు. అమితాబ్ బచ్చన్‌ను ప్రధానిని చేసి ఉన్నా బాగుండేది’ అంటూ ఆమె మీర్జాపూర్‌లో జరిగిన ఓ రోడ్ షోలో మాట్లాడుతూ అన్నారు.
*మూడ్రోజుల్లోపే ఛైర్మన్ల ఎన్నిక జరగాలి
ఓట్ల లెక్కింపు జరిగిన మూడ్రోజుల్లోపే మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల(జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ) ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అలా కుదరదనుకుంటే ఓట్ల లెక్కింపు మే 27న కాకుండా జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారంలో చేపట్టాలని కోరారు. ఓట్ల లెక్కింపు జరిగిన 40 రోజుల తర్వాత జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నిక చేపట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
*భాజపా 280 మార్క్ దాటుతుంది
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భాజపాకు మిత్రుల సహాయం అవసరం అవుతుందన్న రామ్‌మాధవ్ వ్యాఖ్యలను భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తోసిపుచ్చారు. తమ పార్టీకి సొంతంగా 280కుపైగా స్థానాలు వస్తాయని, ఎన్డీయేకు 300కుపైగా స్థానాలు లభిస్తాయని చెప్పారు. ప్రాంతీయ నేతలైన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌ల ప్రస్తావనఅనవసరమని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లు సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల్లో గెలిచే స్థానాలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా చాలా మంది ప్రధానమంత్రి అయిపోవాలని కలలు కంటున్నారని విమర్శించారు.
*ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పలేం
కేంద్రంలో ఎన్డీయేలో లేని పార్టీలతో కూడిన ప్రత్యామ్నాయ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య భూమిక నిర్వహించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎంపికలోను కాంగ్రెస్ పాత్ర కీలకమవుతుందని ‘రాయిటర్స్’ ప్రతినిధికి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న అంశంపై తన మనసులో మాట బయట పెట్టేందుకు ఆయన నిరాకరించారు. ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకునేందుకు అవకాశం ఉన్నవారిలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా ఉంటారని మాత్రం ఆయన తెలిపారు. ఆమె అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బలమైన నేత కావడం కలసి వచ్చే అంశంగా పేర్కొన్నారు.
*వైకాపా పాపాలు త్వరలో బట్టబయలు: దేవినేని
వైకాపా అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్(పీకే) చేసిన పాపాలు బట్టబయలు అయ్యే సమయం ఆసన్నమైందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈనెల 23 తరువాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని, అందులో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు.
*ఈసీ తీరు ప్రజాస్వామ్య విరుద్ధం
చంద్రగిరి నియోజకవర్గంలో 40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం ప్రజాస్వామ్యానికివిరుద్ధమని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈసీ ‘మోదీ కమిషన్ ఆఫ్ ఇండియా’గా మారిందని ఆరోపించారు. టీఎన్ శేషన్ హయాంలో సంస్కరణలు తెస్తే, ఇప్పుడు ఉన్న ఎన్నికల కమిషన్ వాటికి వ్యతిరేక పద్ధతిలో వెళ్తోందని విమర్శించారు. ఈసీపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బెంగాల్‌లో ఒక రోజు ముందే ప్రచారం ఆపడం.. దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నారు. 23న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తెదేపా సంపూర్ణ మెజార్టీతో గెలుస్తుందని, ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తారని స్పష్టం చేశారు.
*సీఎస్ తీరు ఆక్షేపణీయం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సెక్రటరీగా మారిపోయినట్టున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ వ్యాఖ్యానించారు. రీపోలింగ్ నిర్వహించాలని కలెక్టర్‌కు, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయకుండా సీఎస్‌కు ఫిర్యాదు చేయడమేంటని, ఫిర్యాదు అందుకున్న సీఎస్ దాన్ని ఈసీకి పంపడమేంటని నిలదీశారు.
*వైకాపా పాపాలు త్వరలో బట్టబయలు – దేవినేని
వైకాపా అధినేత జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ చేసిన పాపాలు బట్టబయలు అయ్యే సమయం ఆసన్నమయిందని మంత్రి ఉమా అన్నారు. ఈనెల 23 తరువాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని అందులో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. విజయవాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం విలేరకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రతిపక్ష నేత జగన్ రూ. మూడు వందల కోట్లు చెల్లించి పీకేను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని తుని రైలు ఘటన నుంచి ఈవీఎంలు సక్రమంగా పనిచేయని సంఘటన వరకు ఆయన పాత్ర స్పష్టమవుతోందని పేర్కొన్నారు. కొంత మంది మాజీ ఐఏఎస్ లు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడకుండా రాజమండ్రి వెళ్లి విలేకరుల సమావేశం పెట్టి పోలవరంలో అవినీతి చోటు చేసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
*యుద్ధం యోచన లేదు-ట్రంప్
ఇరాన్ తో యుద్ధం యోచన ;లేదని అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విదేశంగా శాఖ మంత్రి మైక్ పాంపియోలు తనను యుద్ధం వైపునకు నేట్టేస్తున్నరన్న ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఇరాన్ దురుసుగా ప్రవర్తిస్తోందన్న వాదనపై మరింత సమాచారం ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు వైట్ హౌస్ ను డిమాండ్ చేశాయి. దీంతో అమెరికా కాంగ్రెస్ లోని అగ్రశ్రేణి సభ్యులకు ప్రభుత్వం రహస్య వివరణ ఇచ్చింది.
*జాతీయ వాదమే ప్రచారాస్త్రం.
దేశ వ్యాప్తంగా యాభై రోజుల పాటు సాగించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం మధ్యప్రదేశ్ లోని ఖర్గొన్ లో ముగించారు. పదిహేడవ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ లోని మేరాట్ లో ఆరంభించిన మోడీ. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మరికొన్ని ప్రాంతీయ పార్టీల పై విమర్సల జడివాన కురిపించారు. జాతీయవాదం సాయుధ దళాలు, సరిహద్దుల్లో దాడులు, తమ ప్రభుత్వ ఘనతలను చాటుకుంటూ ప్రచారం సాగించారు. ఎన్నికలు తేదీలు ప్రకటించిన తరువాత మర్చి 28న మేరాట్ లో మోడీ తన తోలి ఎన్నికల ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ కాపలాదారు ప్రభుత్వం నేలపైనా ఆకాశంలోనూ, అంతరిక్షంలోనూ మెరుపుదాడులు నిర్వహించింది. మనదేశం అభివృద్ధి చెందాలి. శత్రువుల నుంచి సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. అదే ఉద్రూతిని ఖర్గొన్ లో కొనసాగిస్తూ ఉగ్రవాదం నక్సలిజం రూపుమాపడం పై తన నిర్ణయాత్మక విధానాన్ని ఎలుగెత్తి చాటుకున్నారు.
* భాజపా, తృణముల్ రెండూ విషాలే..
పశ్చిమ బెంగాల్ లో భాజపా తృణముల్ కాంగ్రెస్ పార్టీ రూపంలో రెండు రకాల విషాలు ఉన్నాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ అన్నారు. వాటికి దూరంగా ఉండాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బ్రాండ్ ఏదైనా సరే విషం చంపేస్తోంది అని వ్యాఖ్యానించారు. బెల్ పహరీలో ఇటీవల పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తృణముల్ విధానలతో ప్రజల్లో అసంతృప్తి పెరుకుపోయిందని కారాట్ అన్నారు. రాష్ట్రంలో ప్రత్యమన్యంగా తమను తాము చెప్పుకొనేందుకు భాజపా భారీగా డబ్బు కుమ్మరిస్తోందని కేంద్ర ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కోల్ కతాలో ఇటీవల అమిత్ షా ర్యాలీ సమయంలో కొందరు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ద్వంసం చేయడం తరువాత ఘర్షణలు చోటు చేసుకోవడం అవమానకరమని కారాట్ పేర్కొన్నారు.
*ముస్లీం ఓట్లలో చీలిక
సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ బహుజన సమాజ్ పార్టీల కూటమి వైపు మేగ్గాలా లేదా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా అన్న విషయాన్నీ ఏడో దశలో ఒటేయల్సిన తూర్పు ఉత్తరప్రదేశ్ ముస్లీంలు ఇంకా నిర్నయిన్చుకోలేకపోతున్నారు. గోరఖ్ పూర్ లో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ల హయాంలో జరిగిన అభివృద్ధి వైపు కొందరు మొగ్గు చూపిస్తుంటే.. మరికొందరిలో అభద్రతా భావం కనిపిస్తోంది. ఓటు వేసే విషయంలో తమవారిలో ఏకాభిప్రాయం లేదని గోరఖ్ పూర్ లోని అతిపెద్ద మసీదులో ప్రార్ధనలు చేయించే ముఫ్తీ మహమద్ వలీయుల్లా చెప్పారు. చదువురాని, లేదా తక్కువగా వచ్చిన వారు ఎస్పీ- బీఎస్పీ కూటమి వైపు చదువుకున్న వారు కాంగ్రెస్ వైపు వెళ్తే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. గోరఖ్ పూర్లో ముస్లీం జనాభా పది శతం ఉంటుందని. అక్కడి గోరఖ పూర్ మటం ఉండేది ముస్లీం ప్రాబల్యం ప్రాంతంలోనే.
*పదిహేను శాతం మహిళా అభ్యర్ధులు నేర చరితులే
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల్లో పదిహేను శాతం మంది పై క్రిమినల్ కేసులు నమోదైనట్లు అసోసియేష్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించారు. ఏడూ దశల్లోనూ కలిపి 724 మంది మహిళలు పోటీ చేస్తుండగా… వారిలో 716మంది ప్రమాణ పత్రలను విశ్లేచించిన అనంతరం ఈ విషయాన్నీ వెల్లడిస్తున్నారు. ఎనిమిది మంది ప్రమాణ పత్రాలు సరిగా స్కాన్ కానందున పూర్తీ వివరాలు అందుబాటులో లేనందున విశ్లేచించక పోయినట్లు తెలిపింది. 716 మంది అభ్యర్ధుల్లో 110 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 78 మంది పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది.
* రాహుల్, శరద్ పవార్‌లను కలిసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్‌ుక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం రాహుల్‌తో బాబు చర్చించినట్లు సమాచారం. సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డీ. రాజాలనూ బాబు కలిశారు. ఆ తర్వాత ఇవాళ ఢిల్లీలోనే ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను కూడా కలసుకున్నారు. సుమారు గంట సమయం పాటు రాహుల్‌తో బాబు ముచ్చటించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఒకేవేదికకు తీసుకురావాలన్న అభిప్రాయాన్ని బాబు వినిపించారు. ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకుంటే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాహుల్‌కు ఏపీ సీఎం వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక కూటమి కోసం మమతా బెనర్జీతో బాబు ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. ఇవాళ సాయంత్రం లక్నోలో అఖిలేశ్, మాయావతిలను కూడా ఆయన కలుసుకోనున్నారు.
కేసీఆర్‌కు చంద్రబాబు స్వాగతం-రాజకీయం-05/18
Related tags :