DailyDose

కారీరిష్టి యాగం ముగిసింది

karirishti yagam finishes successfully in tirumala 2019 - tnilive - telugu news international - devotional telugu news - tirumala karirishti yagam

1.తిరుమల నిండా.. నాణేల కొండ- తదితర ఆద్యాత్మిక వార్తలు
నాణేల నిల్వలతో మొత్తం తితిదే ఖజానా నిండింది. వాటిని ఏం చేయాలో… ఎలా నగదుగా మార్చుకోవాలో తితిదేకు అర్ధం కావడం లేదు. మారకంలో లేని నాణేలు ఒక పక్క… ప్రస్తుతం మారే నాణేలు మరోపక్క గుట్టలుగా ఉండిపోయాయి. వీటిని తరలించడంలో అవాంతరాలు… నిర్లక్ష్యం… ఆరోపణలు తితిదే అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోపక్క నాణేల మూటలతో ఖజానానే కాదు… బ్యాంకు చెస్ట్‌లు, పరకామణి ఖాళీ లేకుండా ఉన్నాయి. భారీగా నిల్వ ఉండిపోయిన నాణేలను ఎప్పటికప్పుడు తరలించడంలోనే ఎక్కడో లోపం జరుగుతోంది. కనీసం హుండీ ఆదాయంగా పరిగణించని వాటిని.. మూటలు కట్టి మూలనపడేస్తున్నారు. అక్కడితో పని ముగిసినట్లు భావిస్తున్నారు.పాత నాణేలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2014 జనవరిలో ప్రకటించింది. పావలా నాణేలు అప్పటికే తితిదే వద్ద భారీగా ఉన్నాయి. ముఖ్యంగా పావలాను స్టీల్‌తో తయారు చేయించారు. తితిదే మూటల్లోనే మగ్గిన పాత నాణేలను ఆర్‌బీఐకు పంపి… మార్చుకోవడంలో అప్పటి తితిదే అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో ఇప్పుడు అవి 90 టన్నుల వరకు ఉండిపోయాయి. ప్రస్తుతం వీటిని తమిళనాడులోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు ఇచ్చి నాణేలు కరిగించాలని తితిదే భావిస్తోంది. సెయిల్‌ దీనికి బదులుగా డబ్బు ఇచ్చేందుకు అంగీకరించలేదు. టన్నుకు రూ.27 వేల విలువ కట్టి.. ఆ మేర తితిదేకు లడ్డూ ట్రెలను ఇచ్చేందుకు అంగీకరించింది. 2011లోనే కేంద్రం నాణేలను కరిగించకూడదని, అలా కరిగిస్తే 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు తితిదే ఆర్‌బీఐ వద్ద అనుమతి తీసుకొని మరీ సెయిల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
*ఇక్కడే మరోకొత్త చిక్కు వచ్చి పడింది. పావలా నాణేలను పాత నాణేలను సేకరించే పలు సంఘాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. టన్నుకు రూ.88లు ఇచ్చేందుకు వారు సిద్ధం అవుతున్నారు. దీంతో పాటు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదు. ఇక సెయిల్‌కు ఇస్తే రూ.24.30 లక్షలు వస్తే.. అది పాత కాయిన్లు కలెక్ట్‌ చేసుకునే సంఘాలు తమకు ఆ పావలా కాయిన్లు ఇస్తే రూ.79.20లక్షలు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. అంటే సుమారు రూ.55లక్షలను తితిదే వద్దనుకుంటోంది. వీటికి కనీసం టెండర్లు పిలిస్తే… ఆసక్తిగల వారు వస్తారని, అలా చేయకపోవడంపై తితిదేపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
*హుండీలో పడే ప్రతి వస్తువు చివరకు స్వామి మాల వేసుకునే అయ్యప్పభక్తులు హుండీలో వేసే కాపర్‌ను సైతం తితిదే అమ్మకానికి పెడుతోంది. వేలం నిర్వహించి దాన్ని గుత్తేదారులకు ఇస్తోంది. మరి మూలనపడి ఉన్న నాణేలను ఇవ్వడంలో తితిదే ఎందుకు వెనకడుగు వేస్తోందన్నది నాణేల సేకరణదారుల ప్రశ్న. దీనిపై కనీసం తితిదే కౌంటర్లలో వీటిని అమ్మినా…. అధికమొత్తం పోసి కొనుగోలు చేసేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారని వారు చెబుతున్నారు.
*రూపాయి, రూ.2, రూ.5, రూ.10 నాణేలు పరకామణిలు రూ.30 కోట్లు, ఎస్వీ విశ్వవిద్యాలయం చెస్ట్‌లో రూ.20 కోట్లు ఉన్నాయి. ఇక పైసా, ఐదు, పది పైసలు, 20 పైసలు వంటి అల్యూమినియం నాణేలు సైతం 150 టన్నులు తితిదే ఖజానాలో ఉన్నాయి. వీటి ముఖ విలువ రూ.కోటి వరకు ఉంటుంది. ఇక వీటిని అలాగే నిల్వ ఉంచుతోంది.. తప్ఫ.. ఏం చేయాలనే దానిపై తితిదేకు స్పష్టత లేదు. ఇవి అల్యూమినియం కావడంతో చాలావరకు నాణేలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాని స్థితికి చేరుకుంటున్నాయి.
*వీటికి తోడు విదేశీ నాణేలు మయన్మార్‌, సింగపూర్‌, జపాన్‌లకు చెందిన పలు విదేశీ నాణేలు తితిదే వద్ద ఉన్నాయి. ఇవి సుమారు 110 టన్నుల వరకు ఉంటాయి. కొన్ని దేశాల్లో మారకం నిషేధించిన నాణేలు సైతం తితిదే వద్ద మగ్గుతున్నాయి. ఆయా దేశాల్లో కనీసం మారకంలో లేని వాటిని తితిదే అలాగే ఉంచుకుంది. కనీసం వాటిని
**ఎప్పటికప్పుడు మార్చుకోవడంపైనా దృష్టి లేదు.
గతంలో తితిదే పరకామణి నుంచి వివిధ బ్యాంకులకు చిల్లర వెళ్లేది. రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల బిళ్లలను విడివిడిగా ఎంచి… మూటలుగా కట్టి బ్యాంకులకు పంపేవారు. వాటి విలువ ప్రకారం బ్యాంకులు డబ్బులు చెల్లించేవి. వాటిని వ్యాపారులకు ఇచ్ఛి.. బ్యాంకులు కమీషన్‌ పొందేవి. బ్యాంకులకు కలిగే లాభంపై తితిదే తగిన సేవలు అందిస్తుండేవారు. ఇప్పుడు కేవలం స్టేట్‌ బ్యాంకుకు మాత్రమే చిల్లరను ఇస్తున్నారు. ఇప్పటికే ఎస్వీ విశ్వవిద్యాలయం చెస్ట్‌ మొత్తం పరాకామణి చిల్లరతో నిండిపోయింది. దీంతో వారు కూడా చిల్లరను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.
*పరకామణి నుంచి ఏరే చిల్లరను రోజువారీ హుండీ ఆదాయంలో చూపించరు. నాణేలను వేరు చేసి… కేవలం బరువు ఆధారంగా మాత్రమే నాణేలను మూటలు కట్టి బయటకు పంపుతారు. ఇక్కడ సైతం మతలబు జరుగుతోందనేది ప్రధాన ఆరోపణ. కొన్ని రూపాయి మూటల్లో… రూ.10, రూ.5ల నాణేలను పెట్టి భారీగా నింపుతున్నారని, పైకి గోనె సంచిపై రూపాయి నాణేల మూటా అని రాసున్నా, దాని నిండా వేర్వేరు కాయిన్లు కనిపిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బ్యాంకుకు నాణేలను ఇచ్చే అవుట్‌ సోర్సింగు ఉద్యోగులు, తితిదేలోని కొందరు ఉద్యోగులు కుమ్మక్కయ్యారనేది ప్రధాన ఆరోపణ.
*నాణేలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం, తరలించడంలో తితిదే ఆర్థిక విభాగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో టన్నులకు టన్నులు నాణేలు ఎప్పుడూ తితిదే వద్ద లేవు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చేవారు. అయితే గత కొంతకాలంగా వీటిని తరలించడంలో ఆర్థిక విభాగంలోని అధికారులు ఆసక్తి చూపడం లేదు.
2. యాదాద్రిలో సహస్ర కలశాభిషేకం
లక్ష్మీనరసింహస్వామిని ఆరాధిస్తూ, శుక్రవారం యాదాద్రి బాలాలయంలో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. స్వామి జయంతి మహోత్సవాల సందర్భంలో, అత్యంత వైభవంగా ఉత్సవ మూర్తులను అభిషేకించారు. తొలుత మూలమంత్ర జపం, పారాయణాలతో మహాపూర్ణాహుతి జరిపారు. ఏటా మూడురోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో, రాత్రి నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని చేపట్టారు. ఈ పర్వంతో ఉత్సవాలు ముగిశాయని ఆలయ స్థానాచార్యులు, ప్రధాన పూజారులు వెల్లడించారు. దాదాపు 4 గంటల పాటు అభిషేక పర్వం కొనసాగింది. భాగ్యనగరానికి చెందిన భక్త దంపతులు 11తులాల స్వర్ణహారాలను స్వామి, అమ్మవార్లకు కానుకగా ఆలయ నిర్వాహకులకు అందజేశారు. యాదాద్రి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పాత గుట్ట ఆలయంలోనూ జయంతివేళ మూలవర్యులకు కలశాభిషేకం నిర్వర్తించారు. శనివారం నుంచి సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణోత్సవాల నిర్వహణలు మొదలవుతాయి. ఉత్సవాల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నర్సింహమూర్తి, సినీహాస్యనటుడు వేణుమాధవ్‌ పాల్గొన్నారు.
3. శ్రీవారి సేవలో కర్ణాటక సీఎం
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, మంత్రి రేవన్న శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని, కర్ణాటకలో కాంగ్రెస్‌ కూటమి 18సీట్లు గెలుస్తుందని ఈసందర్భంగా కుమారస్వామి తెలిపారు. వీఐపీ ప్రారంభ దర్శనసమయంలో ఏపీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
4. కూలిన ఆలయ ధ్వజస్తంభం
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామ సమీపాన కొండపై వెలసిన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం ముందున్న ద్వజస్తంభం కూలిపోయింది. శుక్రవారం సాయంత్రం మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ప్రభావానికి ఆలయ ఆవరణలో ఉన్న ధ్వజస్తంభం పడిపోయిందని ఆలయ అర్చకులు తెలిపారు. 150 సంవత్సరా చరిత్ర కలిగిన దేవాలయంలో ధ్వజస్తంభం నేలకూలడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు.
5. వేడుకగా సీతారాముల కల్యాణం
ఏకశిలా నగరి కోదండ రామాలయంలో శనివారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వేదపండితుల వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాములోరి పెళ్లిని కనులారా తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులు దివ్యానుభూతిని పొందారు.
6. శ్రీవారి సేవలో కర్ణాటక సీఎం
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, మంత్రి రేవన్న శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని, కర్ణాటకలో కాంగ్రెస్‌ కూటమి 18సీట్లు గెలుస్తుందని ఈసందర్భంగా కుమారస్వామి తెలిపారు.
7. తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందిఅన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తులుసర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుందినిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,217నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 2.99 కోట్లు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇంటర్‌తోపాటు తాజాగా పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం సెలవులు, పౌర్ణమి కలిసి రావడం కూడా రద్దీకి మరో కారణం. విపరీతమైన రద్దీ కారణంగా కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది

8. తిరుమల \|/ సమాచారం
ఈ రోజు శనివారం.
*18.05.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
• నిన్న *74,217* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లోని
గదులన్నీ నిండినది
భక్తులు క్యూ కాంప్లెక్స్ బయట
వేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*12* గంటలు పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.99* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
9. చరిత్రలో ఈ రోజు/మే 18
1048: పర్షియా మహాకవి ఒమర్ ఖయ్యాం ఇరాన్ లోని నైషాపూర్ లో జననం (మ.1131).
1877: తెలుగు లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జననం (మ.1923).
1974: భారత్ మొట్టమొదటి సారిగా రాజస్థాన్ ఎడారిలోని పోఖ్రాన్ వద్ద అణు పరీక్షలు నిర్వహించింది.
1986: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ప్రముఖ ఇంజనీరు కె.ఎల్.రావు మరణం (జ.1902)
1987: ఆసియా దేశాల పేదరికం పై రచనలు చేసిన ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం (జ.1898).
2007: హైదరాబాదు మక్కా మసీదు లో బాంబులు పేలాయి.
10. ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
18.05.2019 వతేది, శనివారము ఆలయ సమాచారం*
*శ్రీస్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకై అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ.. తదుపరి స్వామివారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, అలంకరణ, మహా మంగళహారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు.. అనంతరము ఉదయం 7.30 గం|| నుండి మూలవర్లకు విశేషముగా పంచామృత అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును.కావున భక్తాదులు సహాకరించి స్వామి వారి కృపక ప్రాతులు కావలసినదిగా కోరుచున్నాను. తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును. రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 2.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.00 నుండి 6.30 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ..శ్రీస్వామి మల్లెపూల ఉత్సవము సాయంత్రము 4.00గంటల నుండి తిరుమాడవీదుల ఉత్సవము అత్యంత వైభముగా జరుగును తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 6.30 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు
*_18.05.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 65_*
*_18.05.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 10_*
11. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మే 16 నుంచి 27 వ తేదీ వరకు జ‌రుగ‌నున్న బ్రహ్మోత్సవాలు.23 న బ్రహ్మరథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు.భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.
*వాహనసేవల వివరాలు
18-05-2019(శనివారం) ఉదయం10:00 గంటలకు గోవాహనం సాయంత్రం శేష వాహనం
12. నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి పుష్పయాగం టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మే 24వ తేదీన జ‌రుగ‌నున్న పుష్పయాగ మహోత్సవం మే 23వ తేదీ సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం చేప‌డ‌తారు. పుష్పయాగం సందర్భంగా మే 24న ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7.00 గంటల వరకు శ్రీ వేదనారాయణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
13. కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న ప్రధాని మోదీ
చార్‌ధామ్‌ యాత్రల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించుకున్నారు. ఈ ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లారు. కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మోదీ రాక నేపథ్యంలో ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న మోదీ.. ఆదివారం బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మోదీ గతంలోనూ పలుమార్లు దర్శించుకున్నారు. గతేడాది నవంబరు నెలలో దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు 2017లో రెండు సార్లు కేదార్‌నాథ్‌కు వచ్చారు. చివరి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ రేపు ఎన్నిక జరగనుంది. ఇక ప్రధానిగా ఈ ఐదేళ్లలో మోదీ తొలిసారిగా నిన్న మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.
14. జగన్మాతకు మామిడి పండ్లతో పూజ
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు మహిళా భక్త బృందాలు లలితా పారాయణను శుక్రవారం వైభవంగా నిర్వహించాయి. రెండు గంటల పాటు నాలుగు వందల మంది మహిళా భక్తులు లలితా స్త్రోత్రాలు పఠించారు. ఇంద్రకీలాద్రి పరిసరాలు జగన్మాత నామ స్మరణతో మార్మోగాయి. పారాయణ అనంతరం దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మతో కలిసి భక్తబృందాలు అమ్మవారికి మామిడి పండ్ల నైవేద్యం సమర్పించాయి. ప్రతి శుక్రవారం మహిళా భక్త బృందాలు ఇంద్రకీలాద్రిపై లలితా పారాయణ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
15. కనుల పండువగా కల్యాణం
మునేటి తీరాన పల్లగిరికొండపై శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. తొలుత స్వామివారికి అభిషేకాలు చేశారు. మునగచర్ల, కంచికచర్ల, కొండూరు, పల్లగిరి గ్రామాల మహిళలు కోలాటం ప్రదర్శించారు. భజనలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. మాగల్లు మదనగోపాల స్వామి దేవాలయంలో హుస్సేన్‌రావు బృందం భజనలు చేసింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ప్రతినిధులు పబ్బతి నరసింహారావు, అన్నవరపు వెంకటరమణ, గాలం ఏడుకొండలు, కోనంగి శ్రీనివాస్‌, శ్రీనివాసరెడ్డి, రామిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
16. కారీరిష్టి యాగంతో సమృద్ధిగా వర్షాలు – టీటీడీ ఈవో
తిరుమలలో నిర్వహించిన కారీరిష్టి యాగంతో త్వరలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆకాంక్షించారు. తిరుమలలోని పార్వేట మండపం వద్ద ఈనెల 14న ప్రారంభమైన కారీరిష్టి యాగం నేటితో మహాపూర్ణాహుతితో ముగిసింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజ‌యేంద్ర సరస్వతి స్వామివారి శుభాశీస్సులతో వారి పర్యవేక్షణలో ఈ యాగం జరిగింది.ఈ సందర్భంగా టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ.. వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ యాగం నిర్వహించామని, త్వరలో మంచి వర్షాలు కురుస్తాయని విశ్వసిస్తున్నామని తెలిపారు. తద్వారా దేశంలో, రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తొలగి రైతులు, ప్రజలు సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. 2017వ సంవ‌త్స‌రంలో టీటీడీ కారీరిష్టి యాగాన్ని నిర్వ‌హించిద‌ని, ఆ సంవ‌త్స‌రం రాష్ట్రంలో, దేశంలో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయని గుర్తు చేశారు. తద్వారా తిరుమ‌ల‌లోని డ్యామ్ లలో నీరు స‌మృద్ధిగా చేరింద‌న్నారు. ఇందులో భాగంగా శ‌నివారం ఉద‌యం గ‌ణ‌ప‌తి హోమం, శాంతిహోమం, మ‌హాపూర్ణాహుతితో కారీరిష్టి యాగం ముగిసింది. ఈ యాగంలో పురోహితుడు శ్రీ లక్ష్మీవెంకటరమణ దీక్షితర్‌ ప్రధాన బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్వో గోపినాధ్ జెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు.