Business

భారతదేశంలో భారీ పెట్టుబడులు

mastercard to invest 1billion usd in india in 2019

ప్రముఖ పేమెంట్స్‌ సంస్థ మాస్టర్‌ కార్డ్‌ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో దాదాపు బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ గురువారం వెల్లడించింది. దీంతో భారత్‌లో ఉద్యోగుల సంఖ్య కూడా 2,000 నుంచి 4,000కు చేరనున్నట్లు పేర్కొంది. ‘‘2013లో భారత్‌లో మాస్టర్‌కార్డు ఉద్యోగుల సంఖ్య 29. నేడు ఆ సంఖ్య 2,000కు చేరింది. వీరంతా అత్యున్నత శ్రేణి సాంకేతిక నిపుణులు. మేము పురోగతి సాధిస్తుంటాము. వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య రెట్టింపుకానుంది. ఇప్పటికే బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి దాదాపు 2,000 మంది ఉద్యోగులను నియమించాం. వచ్చే ఐదేళ్లలో కూడా మరో బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి మరో 2,000 మందిని నియమించుకొంటాము. ’’ అని సంస్థ దక్షిణాసియా విభాగపు సీనియర్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మాస్టర్‌ కార్డ్‌తో పాటు ఇతర విదేశీ చెల్లింపు సేవలను వినియోగిస్తున్న భారతీయుల వివరాలు భారత ప్రాదేశిక పరిధిలో ఉండాలనే నిబంధనను రిజర్వ్‌బ్యాంక్‌ విధించింది. దీంతో మాస్టర్‌కార్డ్‌ ఆ వివరాలను భద్రపర్చేందుకు పుణేలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భవిష్యతులో రాబోయే రోజుల్లో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు తీసుకురానుంది.