ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి రెండెకరాల ప్రభుత్వ భూమి స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నాంపల్లిలోని గౌసిపురకు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఖురేషి, రషీద్ హుస్సేన్, అమరేంద్రను ప్రధాన నిందితులుగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉస్మాన్ ఖురేషి.. రషీద్ వద్ద తెరాసకు చెందిన లెటర్ హెడ్‌ను రూ.60 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం అమరేంద్రను సంప్రదించి లెటర్‌పై గచ్చిబౌలిలోని 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మ్యుటేషన్ చేయాలని సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా దరఖాస్తు చేశాడు. దీనిపై అనుమానం వచ్చిన రాజేంద్రనగర్ ఆర్డీవో సీఎం కార్యాలయంలో ఈ లేఖ గురించి విచారణ జరపగా.. అది నకిలీదని తేలింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో బాబాఖాన్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నట్టు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఏకంగా కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు
Related tags :