అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ ఐటీ కంపెనీ దావా వేసింది. అది కూడా ఒక భారతీయుడికి హెచ్1-బీ వీసా నిరాకరించిన విషయంలో కావడం గమనార్హం. అతడికి అత్యుతన్నత అర్హతలు ఉన్నా వీసా నిరాకరించడం ‘ఏకపక్షం’, ‘స్పష్టమైన వివక్ష’ కిందకే వస్తుందని తన పిటిషన్‌లో పేర్కొంది. భారత్‌కు చెందిన ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టికి హెచ్1-బీ వీసాను సరైన కారణాలు లేకుండానే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ ఆరోపించింది. ఈ కంపెనీ ఇతనిని బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్‌గా నియమించుకుంది. అతనికిచ్చిన ఉద్యోగం ‘హెచ్1-బి ప్రత్యేక ఉద్యోగం’ కిందకు రాదని చెబుతూ అనిశెట్టికి మారుగా కంపెనీ దాఖలు చేసిన హెచ్1-బీ వీసాను తిరస్కరించడం సబబు కాదని ఆ దావాలో కంపెనీ పేర్కొంది. ‘తిరస్కరణకు సంబంధించి సరైన ఆధారాలు ఇవ్వలేదు. చట్టాలకు విరుద్ధంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది కచ్చితంగా వివక్ష కిందకే వస్తుంద’ని యూఎస్‌సీఐసీ ఆదేశాలను పక్కన పెట్టాలని కోరుతూ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా యూఎస్ డిస్ట్రిక్ట్‌ను ఆ సంస్థ కోరింది. అమెరికా కంపెనీలు విదేశీ సిబ్బందిని ప్రత్యేక ఉద్యోగాల కోసం తీసుకునే సమయంలో హెచ్1-బీ వీసాను జారీ చేస్తారన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా భారత్, చైనాల నుంచి వేల కొద్దీ ఉద్యోగులను అక్కడి ఐటీ కంపెనీలు నియమించుకుంటుంటాయి. కాగా, అనిశెట్టి తన ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్(ఐటీ అండ్ మేనేజ్‌మెంట్)లను యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చేశారు. ప్రస్తుతం ఆయన ఆయన భార్య ద్వారా హెచ్-4 డిపెండెండ్ వీసాను కలిగి ఉన్నారు.
USCISపై Xterra Solutions దావా
Related tags :