*మే 30 నుంచి ఇంగ్లండ్, వేల్స్‌లో జరగబోయే ప్రపంచకప్ మెగా ఈవెంట్‌లో భారత జట్టులో నాలుగో స్థానంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తిక్ ఆ స్థానాన్ని సరిగ్గా భర్తీ చేస్తాడని ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ పేర్కొన్నాడు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ కటిచ్ చాలా విషయాలు పంచుకున్నాడు.
*2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ వెల్లడయ్యాయి. అనేక సంస్థలు ఎన్డీయే కూటమి మెజార్టీ సాధిస్తాయని పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి దాదాపు 330కు పైగా స్థానాలను గెలిచింది. ఈ దఫా ఫలితాల్లో 300కు పైగా గెలవవచ్చని అంచనాలు వేశాయి. 2014లో 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా కూటమి 73 స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికల్లో 45 వరకు గెలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎస్పీ-బీఎస్పీ కూటమి భాజపా అవకాశాలను యూపీలో దెబ్బతీసింది. అయితే యూపీలో ఏర్పడిన లోటును భాజపా పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భర్తీచేసే అవకాశముంది.
* తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు సైకిల్, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారని నిన్న వెల్లడించిన ఆయన ఈ రోజు అంకెలతో కూడిన ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు జరిగినప్పటికీ తెదేపాదే గెలుపు అని స్పష్టంచేశారు. ఏపీలో వైకాపా గట్టిపోటీ ఇచ్చిందని తెలిపారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు పది అటో ఇటో స్థానాలు వస్తాయని వెల్లడించారు. వైకాపాకు 72కు 7 సీట్లు అటో ఇటో వస్తాయని తెలిపారు. జనసేన, ఇతరులకు మూడు సీట్లకు రెండు సీట్లు అటూఇటుగా వస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కేవలం రెండు శాతం ఓట్లు మాత్రమే రెండు పార్టీల మధ్య ఉంటుందని అన్నారు. తెదేపాకు ఇంచుమించు 43 శాతం ఓట్లు వస్తాయని, వైకాపాకు 41శాతం, జనసేనకు 11శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఓట్ల శాతంలో ఒక శాతం అటూఇటుగా ఉంటుందని చెప్పారు. ఏపీలో లోక్‌సభ స్థానాలపై మాట్లాడుతూ..తెదేపాకు 15 సీట్లకు రెండు అటుఇటుగా, వైకాపాకు 10కి రెండు అటుఇటుగా స్థానాలు రావొచ్చని లగడపాటి అంచనావేశారు. జనసేన, ఇతరులకు సున్నా నుంచి ఒక లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టు తమ సర్వేలో తేలిందన్నారు.
* భాజపాయేతర కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా హస్తిన పర్యటనలో బిజీబిజీగా వున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. మోదీ, అమిత్ షా సార్వత్రిక ఎన్నికల్లో వివిధ సందర్భాల్లో నియమావళిని ఉల్లంఘించిన అంశాలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే పలు దఫాలుగా ఈ డిమాండ్‌ను విన్పిస్తోన్న తెదేపా అధినేత.. ఇప్పుడు నేరుగా ఈసీఐకి లేఖాస్త్రం సంధించారు.
*బీఎస్‌ఎన్‌ఎల్ రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రీపెయిడ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.113ను డిస్కౌంట్ ఇచ్చి రూ.786కే ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నది. ఈ ఆఫర్‌ను ఈనెల 18 నుంచి జూన్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. రూ.786 ప్లాన్‌లో 180 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజూ 1.5 జీబీ డేటా, 50 ఎస్‌ఎంఎస్‌లు వర్తిస్తాయి.
*బస్సు నడిపే సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు మొబైల్‌లో మాట్లాడటం, గుట్కా, పాన్ వేసుకోవడంపై నిషేధం విధించాలి. ప్రమాదరహితంగా వాహనాలు నడిపే డ్రైవర్లను ప్రోత్సహించాలి’ అని రాష్ట్ర రహదారులు-భవనాలు, రవాణా, గృహనిర్మాణం, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు స్పష్టంచేశారు.
*హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాలు ఎదురుగా గల మైదానంలో జూన్ 2వతేదీన తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శనివారం దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
*రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడుతూ పట్టుబడిన ఉద్యోగుల కేసులపై విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు.
*అధిక అశ్వికశక్తి కలిగిన సిరీస్‌లోని 100వ రైలు ఇంజిన్ అందుబాటులోకి వచ్చింది. డబ్ల్యూఏపీ-7 సిరీస్‌లోని ఈ ఇంజిన్‌కు ‘శతాశ్వ్’గా నామకరణం చేశారు. సికింద్రాబాద్ లాలాగూడలోని ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్య జెండా ఊపి శనివారం ప్రారంభించారు.
*రెవెన్యూ శాఖలో అవినీతికి పాల్పడుతూ పట్టుబడిన ఉద్యోగుల కేసులపై విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు.
*విద్యార్థులకు జూన్ 1వ తేదీ కన్నా ముందే పూర్తిస్థాయిలో పుస్తకాలు, యూనిఫారాలు అందజేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావులు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి, రాష్ట్రంలోని ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, టీఆర్‌టీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థించారు.
*తెలంగాణలోని న్యాయవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్-2019ను సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను అనుమతించబోమని సెట్ కన్వీనర్ ప్రొ.జి.బి.రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
*ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తు వ్యవహారంలో ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లకు హైకోర్టులో చుక్కెదురైంది. 2016లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఈనెల 3న జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ డైరెక్టర్ నితిన్ గుప్తా, ముసద్దీలాల్ జ్యువెలర్స్ డైరెక్టర్ నిఖిల్ గుప్తా, దాని ఎండీ కైలాష్ చంద్ గుప్తాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
*డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ)లో రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీన ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు.
*పరిపాలనా సంబంధ అంశాల్లో లోపాల పేరిట, వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేందర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు, ఆమెను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ పేర్కొన్నారు. శిరీష 2012 బ్యాచ్‌కు చెందినవారు. 2017 నవంబరులో వికారాబాద్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు
*యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఎయిమ్స్ ఆసుపత్రిలో అధ్యాపకుల నియామకాలకు ప్రకటన జారీ అయింది. ఈ మేరకు ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ ఈ నెల 16న ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రి అనుబంధ వైద్య కళాశాలలో ఈ ఏడాది 50 వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఇక్కడ కళాశాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్‌కు అప్పగించింది. దీంతో 40 మంది అధ్యాపకులు, అధ్యాపకేతరుల నియామకాలకు ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ ప్రకటన జారీ చేశారు. ఆసక్తి గల వారు జూన్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.aiimsbhopal.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
*ల్యాంకో గ్రూపునకు చెందిన పలు విద్యుత్తు కంపెనీల్లో ఇప్పటికే దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతుండగా తాజాగా ఆ జాబితాలో మరో కంపెనీ చేరింది. ల్యాంకో గ్రూపులోని ల్యాంకో థర్మల్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
*భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 22వ తేదీ ఉదయం 5.27 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి46 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి పీఎస్‌ఎల్‌వీ-సీ 46 రిహార్సల్ నిర్వహించనున్నారు. ఇది ముగిసిన తర్వాత ప్రీ కౌంట్‌డౌన్ ప్రక్రియ చేపడతారు. అనంతరం కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది.
*కార్మికుల సమస్య లను పరిష్కరించాలని ఆర్టీసీ ఎండీరాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీని వాసరావు తెలిపారు. సమ్మెకు కార్మికు లను సమాయత్తం చేయడానికి ఈ నెల 20, 21 తేదీల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, నాన్ ఆపరేషన్ యూనిట్ల వద్ద ధర్నా నిర్వహి స్తామ న్నారు. ఆర్టీసీలో సిబ్బంది కుదింపు చర్యలు ఆపాలని, అద్దె బస్సుల పెంపు నిలుపుదల చేయాలని, కార్మికులకు 40 శాతం వేతన బకాయిలు వెంటనే చెల్లిం చాలని సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు
రేపు లాసెట్ పరీక్ష-తాజావార్తలు–05/19
Related tags :