ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్(71) రీసెంట్‌గా దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన క్లాసిక్ ఆఫ్రికా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో అభిమానులతో పాటు ప్లేయర్స్‌తో సరదాగా సంభాషిస్తూ స్నాప్ చాట్ వీడియో తీస్తున్నాడు ఆర్నాల్డ్.
ఇంతలో ఓ అజ్ఞాతవ్యక్తి వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్నాల్డ్‌ని తన్ని అతనే కింద పడ్డాడు.
అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను తీసిన స్నాప్ చాట్ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసిన ఆర్నాల్డ్ ఈ విషయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
క్రౌడ్ ఎక్కువున్న సమయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నన్ను ఎవరో తన్నారని వీడియో చూస్తే కాని తెలియదు.
ఆ ఇడియట్ నా స్నాప్ చాట్ వీడియోని నాశనం చేయనందుకు సంతోషం. మీరందరు నాకు ఓ సాయం చేయాలి.
ఒక వేళ మీరు ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటే ఆ వ్యక్తి అరుపులు వినిపించకుండా ఉన్న వీడియోని చేయండి.
ఆ వ్యక్తి అస్సలు పాపులర్ కాకూడదు. దక్షిణాఫ్రికాలోని ఆర్నాల్డ్ స్పోర్ట్స్ క్లబ్‌లో 90 రకాల క్రీడలు ఉన్నాయి. 24వేల అథ్లెట్లు ఉన్నారు.
ఈ వీడియో ద్వారా వారికి పాపులారిటీ దక్కేలా చేద్దాం అని ఆర్నాల్డ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. నాకు ఇలా జరిగిందని తెలిసి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని కూడా ఆర్నాల్డ్ తెలిపారు.
https://www.youtube.com/watch?v=7jh4ejHmB6Q