బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన సతీమణి సునీతా కపూర్‌కు ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. తన జీవితంలో జరిగిన ది బెస్ట్ విషయం ఆమెను కలవడమేనని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ‘మన ఇద్దరి కలయికలో జీవితం చాలా అందంగా, సాహసోపేతంగా గడిచింది. నా చివరి శ్వాస వరకు నా ప్రేమవు నువ్వే. నీ ప్రేమ, సపోర్ట్ నన్ను ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చాయి. 11 ఏళ్ల డేటింగ్, 35 ఏళ్ల వైవాహిక బంధానికి ధన్యవాదాలు. నీతో కలిసి మరో 46 ఏళ్లు గడిపేందుకు ఎదురుచూస్తున్నా. వార్షికోత్సవ శుభాకాంక్షలు.. లవ్ యు’ అని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అనిల్ పోస్ట్‌కు సునీత రిప్లై ఇచ్చారు. ‘సంతోషాన్ని షేర్ చేసుకున్నాం, కష్టాన్ని తట్టుకున్నాం. మనం నమ్మిన ప్రేమ దారి చూపింది. ఎప్పటికీ ఇలానే కలిసి ఉందాం.. రోజులు, ఏళ్లు గడిచిపోతాయి’ అని ఆమె పేర్కొన్నారు. అనిల్, సునీతల కుమార్తె, నటి సోనమ్ కపూర్ కూడా తన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సంతోషాన్ని పంచుకున్నాం
Related tags :