Health

ఒక నెలరోజులు సైకిల్ తొక్కిచూడండి

biking is the best exercise you can do without much efforts - tnilive - telugu health news

బరువు తగ్గడం కోసం నడక, పరుగు, ఏరోబిక్స్‌… ఇంకా ఇతరత్రా జిమ్‌ వ్యాయామాలు ఎన్నో చేస్తోంది నేటి తరం. కానీ ఊబకాయాన్ని తగ్గించడంతోబాటు శారీరకంగానూ మానసికంగానూ ఫిట్‌గా ఉంచే సైక్లింగ్‌ని మాత్రం మరిచిపోయింది అంటున్నారు టెక్సాస్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. పైగా సైకిల్‌ తొక్కడాన్ని పిల్లలూ పెద్దలూ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి చేత్తో తీసినట్లుగా పోవడంతోబాటు క్యాలరీలూ తగ్గిపోతాయి. అదేసమయంలో గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటి జబ్బుల్నీ దూరంగా ఉంచుతుంది. పైగా స్నేహితులతో కలిసి సరదాగా రైడ్‌కి వెళ్లినట్లూ ఉంటుంది. అయితే రోడ్డుమీద సైక్లింగ్‌ చేసినదానికీ కొండల్లో తొక్కినదానికీ తేడా ఉంటుంది. కొండల్లో తొక్కినప్పుడు కాళ్లే కాదు, మొత్తం శరీరం కదులుతుంటుంది కాబట్టి త్వరగా బరువు తగ్గుతారట. అదీగాక చుట్టూ చెట్లు ఉండే ప్రదేశాల్లో తొక్కడం వల్ల మానసికంగానూ ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు సదరు నిపుణులు.