Politics

కేంద్ర మంత్రుల కరువు. బాకీల్లోనే బంగ్లా అద్దెలు.

Central Ministers Still Owe Rental Money For Their Bungalows - tnilive telugu news international indian political news in telugu

కేంద్రమంత్రుల్లో చాలా మంది తాము నివసించే అధికారిక బంగ్లాలకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదు. ఒక ఆర్టీఐ అర్జీకి వచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర మంతులు విజయ్‌గోయల్‌, ప్రకాశ్‌ జవడేకర్‌, నిర్మలా సీతారామాన్‌, సుష్మా స్వరాజ్‌ వంటి వారు కూడా బకాయిలు చెల్లించలేదని దీనిలో పేర్కొన్నారు. ఈ బకాయిలు అన్నీ బంగ్లాల్లో ఫర్నిచర్‌ , ఇతర సౌకర్యాలకు సంబంధించి చెల్లించాల్సినవి. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే డైరెక్టరేట్‌ ఆఫ్ ఎస్టేట్‌ ఈ విషయాలను చూస్తుంది.
* కేంద్ర మంత్రులు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ రూ.1.46లక్షలు చెల్లించాలి. జితేంద్ర సింగ్‌ రూ.3.18లక్షలు చెల్లించాల్సి ఉంది.
* ఫిబ్రవరి నాటికి కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.53,276, జవడేవకర్‌ రూ.86,923 చెల్లించాల్సి ఉంది.
* కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ రూ.3లక్షలు, మరో మంత్రి గజేంద్ర సింగ్‌ 2,88,269 చెల్లించాల్సి ఉంది. విదేశీ వ్యవహారాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్‌ రూ.98,890 బకాయి ఉన్నారు.