కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సీపీఆర్‌ఎల్) నిర్వహణలోని మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్లు మళ్లీ తెరుచుకొన్నాయి. మే 19న దిల్లీ పరిధిలోని 13 రెస్టారెంట్లను తెరిచారు. ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ పూర్తిగా సీపీఆర్‌ఎల్ పరిధిలోకి వచ్చింది. గతంలో భాగస్వామిగా ఉన్న విక్రమ్‌బక్షి తన వాటాలను దీనికి బదిలీ చేశారు. మే6వ తేదీన విక్రమ్‌బక్షి వివాదాన్ని కోర్టు బయట తేల్చుకొంటామని తెలిపారు. మే 9న సీపీఆర్‌ఎల్‌కు తన వాటాలను విక్రయించేందుకు అంగీకరించారు. ఉత్తర, తూర్పు రీజియన్లలోని రెస్టారెంట్లు మూసే ఉంటాయని కంపెనీ తెలిపింది. కానీ, వీటిని కూడా త్వరలో తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ ఇండియా వెల్లడించింది. ‘‘మేము మళ్లీ మా రెస్టారెంట్లను తెరిచేందుకు ఉత్సుకతతో ఉన్నాము. మరింత నమ్మకమైన సేవలను మా వినియోగదారులకు అందజేసేందుకు సిద్ధమవుతున్నాము. తొలివిడతగా 13 రెస్టారెంట్లను తెరిచాము. ’’ అని సీపీఆర్‌ఎల్ హెడ్ రాబ్ హంగ్‌హాన్‌ఫూ తెలిపారు.
ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో మెక్‌డీ
Related tags :