Business

మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు

Huawei retaliates against the US - tnilive telugu business news

అమెరికా ఆంక్షలు తమ కంపెనీ ఎదుగుదలను ఏమాత్రం ఆడ్డుకోలేవని హువావే చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ రెన్‌జెన్గ్‌ఫె తెలిపారు. మహా అయితే కంపెనీ వృద్ధిరేటు కొంచెం తగ్గవచ్చేమోకానీ అంతకు మించి ఏమీ కాదని విశ్వాసం వ్యక్తం చేశారు. షెన్‌జెన్‌లో జపాన్‌కు చెందిన విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే 15న హువావేపై అమెరికా ఆంక్షలు విధించాక తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. వృద్ధిరేటులో 20శాతం తగ్గుదల ఉండవచ్చేమో అని అన్నారు. అక్కడి చట్టాలను అతిక్రమిస్తూ తాము ఏమీ చేయలేదని రెన్‌ పేర్కొన్నారు. అమెరికా చెప్పిన విధంగా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసే అవకాశం కానీ, అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణకు అనుమతించే అవకాశం కానీ లేదన్నారు. తాము అమెరికా నుంచి చిప్స్‌ను కొనుగోలు చేయకపోయినా నష్టం ఏమీలేదన్నారు. ఇప్పటికే తాము ఈ పరిస్థితికి సిద్ధమైనట్లు వెల్లడించారు. మరో టెలికం దిగ్గజం జెడ్‌టీఈ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది.
జెడ్‌టీఈ, హువావే కంపెనీలు అమెరికాలో టెలికామ్‌ పరికరాలు విక్రయించకుండా అమెరికా వాణిజ్య విభాగం ఆంక్షలు విధించింది. దీంతో అమెరికా కంపెనీలతో వ్యాపారం చేసే అవకాశాన్ని ఈ రెండు కంపెనీలు కోల్పోయాయి. ఈ సందర్భంగా హువావే, దాని అనుబంధ సంస్థలు తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించాయని అమెరికా పేర్కొంది.