Sports

వాళ్లు కిలాడీలు

Nasser Hussain On Indian Cricket Team - tnilive icc cricket world cup details schedule in telugu - sports news telugu

2019 ప్రపంచకప్‌ మరో 11రోజుల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో పాటు ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌, ఇండియా టైటిల్‌ ఫేవరెట్లుగా దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమతమ దేశాలను అభిమాన జట్లుగా చెప్పుకొంటున్నారు. అయితే, పలువురు విదేశీ క్రికెట్‌ దిగ్గజాలు మాత్రం ఇండియానే బలమైన జట్టని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ నాసిర్‌ హుస్సేన్‌ కూడా చేరిపోయారు. ఈసారి ఇంగ్లాండ్‌కు భారత్‌తోనే ముప్పు ఉందని పేర్కొన్నారు. ‘ఈసారి ప్రపంచకప్‌లో అన్ని జట్లకు ప్రధాన ప్రత్యర్థి భారత్‌. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. అందుకే ఆ జట్టును చూసి అన్ని జట్లూ భయపడుతున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మలతో పాటు ఉత్తమ ఫినిషర్‌ ధోనీ కూడా జట్టులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్‌ విషయంలో నంబర్‌ వన్‌ బుమ్రా, భువనేశ్వర్‌కుమార్‌ ఉండటం అదనపు బలం. పవర్‌ప్లేతో పాటు డెత్‌ ఓవర్లలో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌నైనా తిప్పలు పెట్టే సత్తా బుమ్రాకు ఉంది. భువనేశ్వర్‌ కూడా అంతే. బ్యాటింగ్‌ విషయంలో శిఖర్‌ ధావన్‌, రోహిత్‌శర్మ కలిసి పవర్‌ప్లేలో పరుగులు పిండుకుంటున్నారు. ఛేదనలో భారత్‌ మంచి రికార్డు కలిగి ఉంది. కప్పు గెలవాలంటే ప్రతి జట్టు భారత్‌ను దాటాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ఆతిథ్య ఇంగ్లాండ్‌ వన్డేల్లో అగ్రస్థానంతో ప్రపంచకప్‌ బరిలోకి దిగుతోంది. మరోవైపు రెండో స్థానంలో ఉన్న భారత్‌ జూన్‌ 5న సౌతాంప్టన్‌ వేదికగా మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తలపడనుంది.