*** ₹13 కోట్ల అంచనా వ్యయం
*** 5000 మంది అతిథులు
*** అంబరం అదిరే సంబరం
“మనమంతా తెలుగు-మనసంతా వెలుగు” స్ఫూర్తితో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) వచ్చే 24,25,26 తేదీల్లో ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో నిర్వహిస్తున్న 6వ ద్వైవార్షిక అమెరికా తెలుగు సంబరాల తుది ప్రణాలిక సదస్సు ప్లేనోలోని బావర్చి సమావేశ మందిరంలో విజయవంతంగా ముగిసింది. సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో మహిళా, సాంస్కృతిక, ప్రచార, ఆరోగ్య, రిజిస్ట్రేషన్, వెబ్‌సైట్, ఆడియో-వీడియో, బ్యాంక్వెట్ తదితర పదుల సంఖ్యలోని కమిటీలకు చెందిన ప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు సంబరాల విజయవంతానికి తమ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను సభికులకు వివరించారు. 24 గంటల్లో 8గంటల ఆఫీసు ఉద్యోగంతో పాటు అదనంగా 12గంటల నాట్స్ సంబరాల ఏర్పాట్ల ఉద్యోగాన్ని కూడా నిర్వహించినందుకు సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కిషోర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 4000 మంది అతిథులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, శుక్రవారం నాటికి మరో 1000మంది పెరిగే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ సంబరాల నిర్వహణకు అంచనా వ్యయం ₹13కోట్లు వరకు ($2మిలియన్ డాలర్లు) వస్తోందని, విరాళాలు అందించిన దాతలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులు అన్నే విజయశేఖర్, మాదాల రాజేంద్ర, నూతి బాపు, వీరగంధం కిషోర్, ఆది గెల్లి తదితరులు పాల్గొన్నారు.
Tags: NATS 2019, NATS America Telugu Sambaralu 2019, NATS 2019 Irving America Telugu Sambaralu, NATS 2019 Irving Convention
ఘనంగా ముగిసిన నాట్స్ సంబరాల తుది ప్రణాళిక సదస్సు
Related tags :