వేపపువ్వును మించిన యాంటీ బయోటిక్ మరొకటి లేదు.
వేపపువ్వు అంటే ఉగాది పచ్చడిలో వేసకోవడానికేగా అనుకుంటాం. కానీ అందులోని చేదు… ఎన్నో రోగాలకీ సమస్యలకీ మందు. కాబట్టి ఈ కాలంలో వచ్చే వేపపువ్వుని ఎండబెట్టి నిల్వ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
* వేపపువ్వు సహజ యాంటీబయోటిక్. ఇందులో యాంటీమైక్రోబియల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలూ ఎక్కువే. ఎండబెట్టిన పొడిని కషాయం లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల కామెర్లు, మధుమేహం, ఊబకాయం, అజీర్తి, వికారం, గ్యాస్ సమస్యలు, క్షయ, దగ్గు, జలుబు, జ్వరం, నోటిపుండ్లు… ఇలా ఎన్నో వ్యాధుల్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాలనీ నులిపురుగుల్నీ కూడా తొలగిస్తుంది. క్యాన్సర్లు రాకుండానూ చేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. వేపపువ్వుకి కొవ్వునీ పొట్టనీ కరిగించే గుణం కూడా ఉంది. ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. కళ్లసమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకునో లేదా చారుల్లో కూరల్లో వేసుకునో… ఎలా తిన్నా మేలేనట.
* ఈ పొడిని పరగడుపున గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ తొలిగిపోవడంతోబాటు కాలేయం శుభ్రపడుతుంది. రక్త ప్రసరణ బాగుంటుంది. వేపపువ్వు సహజ కాంట్రాసెప్టివ్. ఇందులోని ఆల్కహాలిక్ గుణాలు అండం విడుదలను అడ్డుకుంటాయి.
* ఈ పొడిని తేనెలో కలిపి గాయాలూ పొక్కులమీద రాసినా, నూనెలో కలిపి బ్లాక్‌హెడ్స్‌మీద రాసినా అవి క్రమంగా తగ్గిపోతాయి. చర్మంమీద దద్దుర్లు, పొక్కుల్లాంటివి వస్తే కాసిని వేపాకుల్లో పూలు కలిపి మెత్తగా నూరి రాస్తే ఇన్ఫెక్షన్లు క్రమంగా తగ్గుతాయి.
ఈ పేస్టుని క్రమం తప్పకుండా తలకి పట్టించి తలస్నానం చేయడం వల్ల దురద, చుండ్రు తగ్గుతాయి.
* ఈ పూల పొడిని ఏదైనా నూనెల్లోనో లేదా క్రీముల్లోనో కలిపి రాసుకుంటే ఆ వాసనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వేపపువ్వుని ఏడాది పొడవునా తింటూనే ఉండండి!
ఒక వేపపువ్వు వెయ్యి యాంటీబయాటిక్ బిళ్లలతో సమానం
Related tags :