Agriculture

మహిళారైతుకు అంతర్జాతీయ స్థాయిలో మూడో ప్రైజు

Seed Mother Short Film By Dwivedi Grabs Third Prize At Cannes Film Festival - tnilive telugu agriculture news

అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేదికపై మన భారతీయ మహిళా రైతుపై తీసిన షార్ట్‌ ఫిలింకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది తెరకెక్కించిన ‘సీడ్‌ మదర్’ లఘు చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రానికి నెస్‌ప్రెసో టాలెంట్స్‌ కేటగిరీలో మూడో ప్రైజ్‌ లభించింది. మహారాష్ట్రకు చెందిన రహీబాయి సోమా అనే మహిళా రైతు నేపథ్యంలో దీనిని తెరకెక్కించారు. 1964లో పుట్టిన రహీబాయి ప్రాంతీయంగా లభించే విత్తనాలతో, పురాతన వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం ఆమె ప్రత్యేకత. బీబీసీ టాప్‌ 100 స్ఫూర్తిదాయకమైన మహిళల్లో ఆమె మూడో స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి కూడా అవార్డును అందుకున్నారు. దర్శకుడు అచ్యుతానంద్ తన నివాసంలోని గార్డెన్‌లో విత్తనాలు నాటేందుకు రహీబాయిని సంప్రదించారు. ఆమె గురించి తెలుసుకుని ‘సీడ్‌ మదర్’ను తెరకెక్కించారు. మిర్రర్‌ లెన్స్‌తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించడం గమనార్హం.