అతను ఓ వర్ణ దృష్టిలోపం ఉన్న వ్యక్తి. కానీ శబ్దం ఆధారంగా అన్ని రంగులను గుర్తుపట్టగలడు. వస్తువులనూ గుర్తించగలడు. ఇవన్నీ ఎలా సాధ్యమనుకుంటున్నారా.. అతని తలలో అమర్చిన యాంటినాయే ఈ పనులన్నీ చేయగలుగుతుంది. నీల్‌హార్బీసన్ వర్ణదృష్టి లోపంతో న్యూయార్క్‌లో జన్మించాడు. అతనిలో ఉన్న లోపాన్ని 11 సంవత్సరాల వయస్సులో గుర్తించారు. అప్పటి వరకు ఇబ్బంది అన్పించని వర్ణ దృష్టి లోపం ఇంగ్లండ్‌లోని ఆర్ట్స్ కళాశాలలో ప్రయోగాత్మక సంగీత కూర్పును అధ్యయనం చేసినప్పుడు అతనికి సమస్యగా అనిపించింది. దాంతో నీల్ తనలో ఉన్న లోపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. పట్టుదలతో శ్రమించి టెక్నాలజీని ఉపయోగించి తన తలలో వైఫైతో కూడిన యాంటీనాను అమర్చుకున్నాడు. దాని ద్వారా కళ్ల ముందు కనిపించే రంగులు అతనికి శబ్దాల రూపంలో విన్పిస్తున్నాయి. దీని ద్వారా ఆయన సులభంగా రంగులను గుర్తించగలుగుతున్నారు. ఈ యాంటీనాలో విద్యుత్ అయస్కాంత వికీరణం, ఫోన్‌కాల్స్, మ్యూజిక్ వినగల కంపనాలు, అనువదించిన వీడియోలు ఉన్నాయని నీల్ చెబుతున్నారు. తలలో యాంటీనా అమర్చుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా ప్రభుత్వంతో చట్టబద్ధత కలిగిన సైబోర్గ్‌గా నీల్ గుర్తింపు పొందాడు. నీల్ చూస్తున్న రంగుల ఆధారంగా విన్పించే శబ్దం విని ఎదుటి వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సూపర్ మార్కెట్‌కి వెళితే అక్కడ ఉన్న సరకుల కన్నా వాటి రంగుల ఆధారంగా విన్పించే శబ్దాలు డీజే మ్యూజిక్ వింటున్నట్లు ఉంటుందని నీల్ చెబుతున్నారు.
ఆ యంటీనాతో రంగులు చూస్తాడు
Related tags :