తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత ఎన్నారైలదేనన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తెరాస ఎన్నారైల ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. రైతు కళ్లలో సంతోషాన్ని, చిరునవ్వును చూడాలన్నదే కేసీఆర్ విజన్ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఎన్నారైల ఆతిథ్యం, ఆత్మీయత చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నట్టు అనిపిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో రైతుల కళ్లలో సంతోషం… 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాకు వచ్చిన సందర్భంలో 10 రోజుల్లో 14రాష్ట్రాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం 2019 ట్యాంపాలోనే అందరిని కలిసానని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రైతుల కష్టాలు పోయి వారి కళ్లలో సంతోషాన్ని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్…అభివృద్ధి అంటే ఒకప్పుడు బంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఉండేవని ప్రస్తుతం తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తూ… మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ, మార్కెటింగ్ వ్యవస్థ, మోటార్, స్టాటర్ అవసరం లేకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు హరీశ్ రావు. ఒక వ్యవసాయ రంగమే కాకుండా విద్య, వైద్యం, విద్యుత్ అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిది…నాటి తెలంగాణ ఉద్యమంలో, నేటి రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకంగా ఉందని తెలిపారు హరీశ్ రావు. ఎన్నారైల పట్టుదల, సమయపాలన నచ్చాయని కితాబిచ్చారు. ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు సంస్కృతి , సాంప్రదాయాలను మరువలేదన్నారు.
ఫ్లోరిడాలో పర్యటించిన హరీష్‌రావు
Related tags :