మీరు సన్నగా ఉన్నా… దుస్తులతో నిండుగా కనిపించేలా చేయొచ్చు. అందుకోసం మీరు కాస్త మందంగా కనిపించేలా చేసే వస్త్రాల్ని ఎంచుకోవాలి. అలాంటి వాటిల్లో ఆర్గాంజా, బెనారస్, కంచిపట్టు, చేనేత కాటన్ వంటివి ఉంటాయి. అలానే వాటిని కుట్టించుకునే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిల్స్, రఫుల్స్, బెల్స్ వంటివాటిని ఎంచుకోవాలి. ప్రింట్ల విషయానికి వస్తే పెద్ద పెద్ద పూలు, గళ్లు, అడ్డు గీతల్ని ప్రయత్నించొచ్చు. ఇవన్నీ మిమ్మల్ని లావుగా కనిపించేలా చేస్తాయి. అలానే అనార్కలీలు, లేయర్డ్ స్కర్ట్‌లు, పలాజోలు మీకు నప్పుతాయి. మీరు మరీ ఒంటికి అతుక్కునే రకాలు వేసుకోకూడదు. అలాగే సింగిల్ పీస్‌ల కంటే రెండు మూడుగా ఉండే డిజైన్లకు ప్రాధాన్యం ఇస్తే చాలు. మరీ సన్నగా కనిపించరు.
దుస్తులతో లావుగా ఉండేలా చేయవచ్చు…
Related tags :