* ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు జై కొట్టడంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఢిల్లీకి రావడం లేదని లక్నోలోనే ఉంటారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. బీజేపీయేతర పక్షాల సమావేశంలో గానీ సోనియా, రాహుల్ గాంధీలతో గానీ ఎలాంటి భేటీ ఉండదని తెలిపాయి. మరో వైపు లోక్నో వెళ్లి మాయావతిలో చర్చలు జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సోనియాగాంధీ, మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.
* ఎగ్జిట్ పోల్ ఫలితాలపై బాధలేదు – స్టాలిన్
ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై డీఎంకే ఎంతమాత్రం బాధపడటంలేదని ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌పై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మూడు రోజుల్లో ప్రజాతీర్పు తెలుస్తుంది. అందుకోసం మేం ఎదురుచూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎంకే ఎంతమాత్రం బాధపడటం లేదు. అది అనుకూలమైనా..వ్యతిరేకమైనా’ అని అన్నారు. ఏడుదశల పోలింగ్ ముగియగానే దాదాపు అన్ని సర్వేసంస్థలు తమిళనాడులో మెజారీటీ స్థానాలు డీఎంకేకు దక్కుతాయని పేర్కొన్నాయి.
*ఎన్డీయే నేతలకు అమిత్ షా విందు
నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) నేతలకు మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన ఎన్డీయే కీలక నేతలకు ఆహ్వానం పంపినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు రెండు రోజుల పాటు సాయంత్రం వేళ విందు పేరుతో ఆయన సమావేశం కానున్నట్టు చెబుతున్నారు. కేంద్ర మంత్రి మండలి సైతం రేపు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* అఖిలేశ్-మాయావతి భేటీ
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సోమవారం లఖ్‌నవూలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల కౌటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడితో కలిసి తెరవెనుక విపక్షాల ఐక్యతకు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన నాయుడు గతవారం మాయావతితో సమావేశమయ్యారు.
*ప్రధానికి ఈసీ దాసోహం
ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం(ఈసీ) లొంగిపోయిందని, ఈసీ అంటే ఇకపై ఎవరికీ భయం, గౌరవం ఉండవని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘ఎలక్టోరల్ బాండ్లు మొదలు కొని ఈవీఎంలు, ఎన్నికల షెడ్యూల్‌లో మోసం, నమో టీవీ ప్రారంభం, మోదీ సైన్యం అంటూ వ్యాఖ్యలు.. తాజాగా కేదార్‌నాథ్‌లో మోదీ డ్రామా.. వీటన్నిటి విషయంలో ఈసీ మోదీకి, ఆయన ముఠాకు సాగిలపడిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈసీ అంటే ఇకపై ఎవరికీ గౌరవం కానీ, భయం కానీ ఉండవు’ అని ఆదివారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
*యూపీలో తగ్గనున్న కమలం ప్రాభవం
దేశంలో అత్యధిక లోక్ సభ స్తాన్లు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాజపాకి సీట్లు తగ్గిపోనున్నాయి. గత ఎన్నికల్లో ఏక పక్షంగా సీట్లను కోవాసం చేసుకున్న భాజపా ఈసారి భారీగా సీట్లు కోల్పోనున్నాయి. గత ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లను కైవసం చేసుకున్న భాజపా ఈసారి భారీగా సీట్లు కోల్పోనున్నట్టు ఆయా సంస్థలు నిర్వహించిన ఎక్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. యూపీలో భాజపా హవాకు అడ్డుకట్ట వేయడానికి అఖిలేష్ యాదవ్, మాయావతి కూటమి పని చేసినట్టు ఎక్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేసినప్పటికీ అధికార భాజపా యుపీలోని మొత్తం 80 స్థానానికి సగానికి పైగా గెలుచుకుంటుందని ఎక్జిట్ పోల్స్ వెల్లడించాయి.
*తమిళనాడులో డీఎంకే … కర్ణాటకలో భాజపా హవా
ఎక్జిట్ పోల్స్ ప్రకారం తమిళనాడులో కాంగ్రెస్- డీ ఎంకే కూటమి హవా సాగింది. పాలక ఏఐఏడీఎంకేతో –ఎన్డీయే కూటమి కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమయింది. 2014లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఏఐఏడీఎంకే ముప్పై శాతానికే ఓట్లను కోల్పోనుంది. కర్నాటకలో 28 స్ధానాలకు గాను బీజేపీ 20 స్ధానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ వెల్లడించింది. కర్నాటకలో బీజేపీ ఓటింగ్ శాతం 43 నుంచి 48.5 శాతానికి పెరగనుంది. పాలక జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గట్టి షాక్ తగలనుంది. ఈ కూటమికి 2014లో 11 స్ధానాలు దక్కగా ఇప్పుడు ఏడు స్ధానాలు మాత్రమే లభించనున్నాయి.
*బెంగాల్ లో దీదీకి షాక్
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తో భాజపా దీటుగా తలపడింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తృణముల్ ఆధిపత్యానికి గండికోడుతూ బెంగాల్ లో కమలాదళం పదకొండు స్థానాలు గెలుచుకుంది. 2014లో బెంగాల్ లో భాజపా కేవలం రెండు స్థానల్లో గెలుపొందడం గమనార్హం. ఇక గత ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓటింగ్ శతం పదిహేడు నుంచి ఏకంగా 32 శాతానికి ఎగబాకింది. ఇక సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ప్రంట్ కేవలం ఒక స్థానానికే పరిమితం కానుంది. బెంగాల్ లో భాజపాకి [పది నుంచి పందొమ్మిది సీట్లు రావొచ్చని మరికొన్ని ఎక్గిట్ పోల్స్ అంచనా వేశాయి.
*ఎక్జిట్ పోల్స్ ను నమ్మొద్దు – మమత
ఎక్జిట్ పోల్స్ అన్నీ వదంతులేనని వాటిని నమ్మొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రీ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తానూ అలాంటి సర్వేలను విశ్వచించనన్నారు. ఆదివారం వెలువడిన ఎక్జిట్ పోల్స్ లో అత్యధికం కేంద్రంలో భాజపా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. పశ్చిమ బెంగాల్ లోని 42లోక్ సభ స్థానల్లో తృణముల్ 24 గెలుచుకుంటుందని భాజపా పదహారు, కాంగ్రెస్ రెండు స్థానల్లో విజయం సాధిస్తుందని కొన్ని ఎక్జిట్ పోల్స్ చెప్పాయి. వీటి పై మమత స్పందిస్తూ ఎక్జిట్ పోల్స్ వదంతులను నేను నమ్మను. ఈవీఎంలను దుర్వినియోగం చేసి గెలవలన్నది అధికార పార్టీ ప్రణాళిక. అందుకే విపక్షాలన్నీ కలిసి కట్టుగా ధరియంగా ఉండాలి సమష్టిగా పోరాడాలి అని మమత ట్విట్ చేశారు.
*భాజపాకు 300 సీట్ల పైనే – యోగి
ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 300కు పైగా లోక్ సభ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాద్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఎనభై లోక్ సభ స్థానాలకు 74 స్థానాల్లో కమలానిదే గెలుపని చెప్పారు. ఆదివారం గోరఖ్ పూర్ లో ఓటేసిన అనంతరం ఆదిత్యనాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
*మోడీని ఆశీర్వదించడానికి నేనెవర్ని- జోషి
ప్రధాని మోడీని ఆశీర్వదించడానికి నేనెవర్నీ ఆయన్ను ప్రజలే ఆశీర్వదిస్తారని భాజపా సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీ నిర్వేదంగా వ్యాఖ్యానించారు. చివడి దశలో పోలింగ్లో భాగంగా ఆదివారం వారాణసిలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మోడీని ఆశీర్వదించారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన పైవిధంగా జవాబిచ్చారు. వయస్సు ఎక్కువగా ఉందని జోషీకి ఈసారి భాజపా టికెట్ ఎవ్వని సంగతి తెలిసిందే.
*ఎంపీ జేసీకి ఊరట
సార్వత్రిక ఎన్నికలలో ధన ప్రవాహం పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఎన్నికల అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల పోలింగ్ అనంతరం అమరావతిలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీదియాటి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్ధులందరూ కలిసి రూ. కోట్లు ఖర్చు చేహరని, తమ కుమారుల విషయంలోనూ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినట్లు వ్యాఖ్యానించారు. దీనిపై అనంతపురం జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జేసీ వ్యాఖ్యల పై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని తాడిపత్రి రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డిని కలెక్టర్ వీరపాండీయన్ ఆదేశించారు. విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి ఎంపీ జేసీకి క్లీన్ చీట్ ఇచ్చారు.
*సం క్షేమా పదకలే తెదేపా గెలుపునకు దోహదం.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పదకలే తెదేపా గెలుపునకు దోహదపడతాయని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం తూరుపుగోదావరి జిల్లా రాజమండ్రీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలు, వృద్దులు పెద్ద ఎత్తున తేదేపాకు ఓటు వేశారని, వంద నుంచి 110 సీట్లు తేదేపాకు వస్తాయని ప్రస్తుతం చంద్రబాబు డిల్లీ స్థాయిలో పర్యటిస్తూ కొత్త ప్రంట్ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. మోడీ నియంతృత్వ విధానాల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొత్త ప్రధాన మంత్రి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని చంద్రగిరిలో రీపోలింగ్ జగన్ ఒత్తిడితోనే నిర్వహించారు. అయినప్పటికీ అక్కడ తెదేపానే గెలుస్తుంది అని చినరాజప్ప అన్నారు.
*ఈసీ తీరు రాజ్యంగా స్పూర్తికి విరుద్దం
భారత ఎన్నికల సంఘం పనితీరు రాజ్యంగా స్పూర్తికి విరుద్దంగా ఉందని ఆర్ధిక మంత్రి యనమాల్ రామకృష్ణుడు మండిపడ్డారు. భాజపా నేతలకో రకంగా ఇతర పార్టీలకో రకంగా ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం సిఈసి పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ముగ్గురు ఎన్నికల అధికారులు ఉంటె ఇద్దరే ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిర్దేశించడం దారుణమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ అమిత్ షాల పై వచ్చిన పదకొండు ఫిర్యాదుల పై క్లీన్ చీట్ ఇవ్వడం ఈసీ వివక్షతకు పరాకాష్ట మోడీ, షాలకు అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని ఎన్నికల కమిషనర్ లావాసా వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. సుప్రీం కోర్టులో జడ్జీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అసమ్మతి ప్రకటనను నమోదు చేసేటపుడు ఎన్నికల కమిషనర్ చేసిన అసమ్మతిని ఎందుకు రికార్డు చేయరు.
*ఈసీలో పారదర్శకత లోపించింది-వర్ల
ఎన్నికల కమిషన్ పారదర్శకతను కోల్పోయిందని ఆర్టీసీ చైర్మన్వర్ల రామయ్య విమర్శించారు. తన అభిప్రాయాలకు విలువివ్వడంలేదని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా స్వయంగా చెప్పారని, ఈసీలో జవాబుదారితనం లోపించిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఎముందన్నారు.ఆదివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ కేదార్ నాద్ లో పర్యటించడం ఓటర్లను ప్రభావితం చేయడంలో భాగమేనని ఇలాంటి ఉల్లంఘనలపై ఈసీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
*వైకాపావి కుట్ర రాజకీయాలు- ప్రత్తిపాటి
రాష్ట్రంలోని చిలకలూరిపేట మంగళగిరి, సత్తెనపల్లి, గురజాల, మైలవరం గన్నవరం రాప్తాడు, తదితర పది నియోజకవర్గాల్లో అల్లర్లు గొడవలు జరిగే అవకాశం ఉందంటూ వైకాపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా అద్యక్షుడు జగన్ కుట్ర రాజకీయాలు చేసి గెలుపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
*ఫలితాలొచ్చాకే నాయకత్వ చర్చలు- ఏచూరి
ఎన్నికల ఫలితాలు వచ్చాకే కూటమి నాయకత్వ బాధ్యత ఎవరికనేది నిర్ణయిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఆదివారమిక్కడ ఏపీభవన్‌లో సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీని దించేందుకు అన్ని పార్టీలు కలిసి నడుస్తాయి. విపక్షాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
*భాజపాకు 300 సీట్లపైనే..- యోగి
ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా లోక్‌సభ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని, ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలకు 74 స్థానాల్లో కమలానిదే గెలుపని చెప్పారు. ఆదివారం గోరఖ్‌పుర్‌లో ఓటేసిన అనంతరం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
*ఈసీలో పారదర్శకత లోపించింది- వర్ల
ఎన్నికల కమిషన్ పారదర్శకతను కోల్పోయిందని ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. తన అభిప్రాయాలకు విలువివ్వడంలేదని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా స్వయంగా చెప్పారని, ఈసీలో జవాబుదారీతనం లోపించిందనడానికి ఇంతకన్నా నిదర్శనమేముందన్నారు. ఆదివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో వర్లరామయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో పర్యటించడం ఓటర్లను ప్రభావితం చేయడంలో భాగమేనని, ఇలాంటి ఉల్లంఘనలపై ఈసీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ప్రధాని ఎన్నికల కోడ్‌కు అతీతుడా అని ధ్వజమెత్తారు.
*మోదీని ఆశీర్వదించడానికి నేనెవర్ని?: జోషి
ప్రధాని మోదీని ఆశీర్వదించడానికి నేనెవర్ని?, ఆయన్ను ప్రజలే ఆశీర్వదిస్తారని భాజపా సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నిర్వేదంగా వ్యాఖ్యానించారు. చివరి దశ పోలింగ్‌లో భాగంగా ఆదివారం వారణాసిలో ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మోదీని ఆశీర్వదించారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆయన పైవిధంగా జవాబిచ్చారు. వయస్సు ఎక్కువగా ఉందని జోషికి ఈసారి భాజపా టిక్కెట్ ఇవ్వని సంగతి తెలిసిందే.
*ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం
‘ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే ఎన్నికలు, ఎంపికలు, అభ్యర్థులు, రాజకీయపార్టీలన్నీ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలి. ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయ నాయకుల ప్రసంగాలు చూస్తుంటే ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో తెలుస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులేనని… శత్రువులు కాదన్న ప్రాథమిక విషయాన్ని మర్చిపోతున్నారు’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
*ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దు: మమత
ఎగ్జిట్ పోల్స్ అన్నీ వదంతులేనని, వాటిని నమ్మొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను అలాంటి సర్వేలను విశ్వసించనన్నారు. ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికం కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్ 24 గెలుచుకుంటుందని, భాజపా 16, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. వీటిపై మమత స్పందిస్తూ ‘ఎగ్జిట్ పోల్స్ వదంతులను నేను నమ్మను. ఈవీఎంలను దుర్వినియోగం చేసి గెలవాలన్నది అధికార పార్టీ ప్రణాళిక. అందుకే విపక్షాలన్నీ కలిసికట్టుగా, ధైర్యంగా ఉండాలి. సమష్టిగా పోరాడాలి’ అని మమత ట్వీట్ చేశారు.
*ఇక్కడ తెరాస.. అక్కడ తెదేపా
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెదేపాకు పట్టం కట్టబోతున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయన తన ఆర్జీవీ ఫ్లాష్ సంస్థ చేపట్టిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్‌సభ ఫలితాలతో పాటు జాతీయస్థాయిలో అంచనాలు చెప్పారు. ‘‘రాజధాని ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతోంది. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం మారితే చాలా నష్టం అనే ఆలోచనతో చాలామంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. మహిళలు తెదేపా వైపు నిలిచార’’ని పేర్కొన్నారు. ప్రతిపక్ష వైకాపా గణనీయమైన ప్రజామద్దతులో అధికారపక్షానికి మంచి పోటీనిచ్చిందని, అయినా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. మూడోస్థానంలో జనసేన ఉండబోతోందని చెప్పారు.
*మీదే పెద్దన్న పాత్ర
నరేంద్రమోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఎన్డీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల దిశలో సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ ఒక్కతాటిపై నడవాలన్న ఆయన ప్రతిపాదనను రాహుల్‌గాంధీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్, శరద్‌పవార్‌లు అంగీకరించినట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ ‘ఉయ్ ఆర్ వన్’ అని చెప్పగా, మాయావతి మీరు పెద్దన్నయ్య పాత్ర పోషించి అందర్నీ కలిపే బాధ్యతను భుజానకెత్తుకోవాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం తీరిక లేకుండా చర్చల్లో మునిగారు. ఉదయం దిల్లీలో రాహుల్‌గాంధీతో, సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లతో కీలక సమాలోచనలు చేశారు.
*తెలంగాణలో కారు.. ఏపీలో సైకిల్
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సైకిల్, తెలంగాణ ఓటర్లు కారు ఎక్కారని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. మిగులు బడ్జెట్‌తో కూడిన తెలంగాణలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేనందున అక్కడ ఓటర్లు కారు ప్రయాణాన్నే కోరుకున్నారని, లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీ ఓటర్లకు వారికున్న పరిస్థితుల రీత్యా సైకిలే మార్గమైందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ ప్రభుత్వం (హంగ్) ఏర్పాటయ్యే అవకాశమే లేదని, పూర్తి ఆధిక్యతతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కంటే, ఆయన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి తక్కువ స్థానాలు వస్తాయని, పవన్‌కల్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెడతారన్నారు.
*కేదార్‌నాథ్ గుహలో మోదీ ధ్యానం
ఎన్నికల ప్రచారం ముగిసిన మరుసటి రోజైన శనివారం ప్రధాని నరేంద్ర మోదీ హిమాలయ పర్వతాల్లో ఉన్న కేదార్‌నాథ్ దేవాలయాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ వాసులు సంప్రదాయంగా వేసుకునే బూడిద రంగులోని ‘పహాడీ’ దుస్తులు ధరించారు. ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసిన అనంతరం లోనికి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు ఈశ్వరునికి పూజలు చేశారు. తరువాత కాషాయ రంగు శాలువా కప్పుకొని క్లిష్టమైన మార్గంలో రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న పవిత్ర గుహలో ధ్యానం చేశారు.
*డిజిటల్ కరెన్సీతోనే అవినీతి అదుపు
డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడే ఎన్నికల్లో అవినీతి తగ్గుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. శనివారమిక్కడ ‘భారతదేశంలో ఎన్నికల విధానం – జవాబుదారీతనం’పై ఐఐసీలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘ ప్రస్తుత ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేదు. కేంద్రం పెద్ద నోట్లు రద్దుచేసి రూ.2వేల నోటు తీసుకొచ్చింది. దీంతో రాజకీయ నాయకులకు సొమ్ముల పంపిణీ మరింత సులభతరమైంది.
*కేసీఆర్ పేరిట కలెక్టర్‌కు నకిలీ లేఖ
అది హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐటీ కారిడార్‌లకు ఆనుకుని ఉన్న రూ.100 కోట్ల విలువైన స్థలం. ఆ జాగాను తన పేరిట మార్చుకోవాలని (మ్యుటేషన్ చేసుకోవాలని) ఆ వ్యక్తి పథకం పన్నాడు. ఏకంగా ముఖ్యమంత్రి పేరిట నకిలీ లేఖను సృష్టించి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తెరాస రాష్ట్ర అధ్యక్షుడు సదరు వ్యక్తి పేరిట స్థల యాజమాన్య హక్కులను మార్చాలంటూ కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నట్లుగా లేఖను సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇన్‌వార్డ్ సెక్షన్‌లో దానిని అందజేశాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే తెలంగాణ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ లేఖపై ఆరా తీసి నకిలీదని తేల్చారు. దీంతో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తన కార్యాలయంలో శనివారం విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
*చంద్రగిరిలో మరో 2చోట్ల రీపోలింగ్
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం శనివారం నిర్ణయించింది. వైకాపా ఫిర్యాదు మేరకు అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ చేపడుతున్నట్లు రెండు రోజుల కిందటే ప్రకటించగా…తాజాగా తెదేపా నాయకుల ఫిర్యాదు మేరకు చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కాలేపల్లిలోని 310వ పోలింగ్ కేంద్రం, కుప్పంబాదూరులోని 323 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం (నేటి) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు కేంద్రాల్లో ఎన్నిక నిర్వహించనున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ కేంద్రాల్లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంతోపాటు, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరుగుతుంది.
*భారీ మెజారిటీ సాధనే లక్ష్యం
నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రసమితికి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. భారీ మెజారిటీతో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. జిల్లాల వారిగా ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 812, నల్గొండ జిల్లాలో 1084, వరంగల్ జిల్లాలో 905 మంది ఓటర్లు ఉన్నారు. అధికార పార్టీ విజయానికి అవసరమైన మెజారిటీ ఉన్నా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇలా…ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ఓటు వేసే విధంగా పావులు కదుపుతోంది.
*మేము కాంగ్రెస్‌తోనే ఉంటాం: దేవేగౌడ
తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ స్పష్టం చేశారు. తన జన్మదినం సందర్భంగా శనివారం తిరుమల శ్రీవారిని దేవేగౌడ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గత 35 ఏళ్లుగా ఏటా తన పుట్టిన రోజున తిరుమలకు వస్తున్నట్లు గుర్తుచేశారు. ప్రధాని పదవి ఎవరు అధిరోహిస్తారో తెలియదని, తాము యూపీయే కూటమిలోనే ఉంటామని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. జేడీఎస్, కాంగ్రెస్ కూటమి 18 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
*వారణాసి సంచలనం సృష్టిస్తుందా?
ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో సంచలనం నమోదవుతుందేమో అని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలిలో 1977లో వచ్చిన ఫలితమే ఇక్కడ కూడా వస్తుందేమోనని ట్వీట్ చేశారు. అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో దేశంలో ఎన్నికలు జరిగాయి. రాయ్‌బరేలిలో ఇందిరాగాంధీపై రాజ్‌నారాయణ్ 55వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచి సంచలనం సృష్టించారు.
*16 స్థానాల్లో తెరాసదే విజయం
పార్లమెంటు ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని, 16 స్థానాల్లోనూ భారీ మెజారిటీ సాధిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్ల పాత్ర కీలకమని, అనుక్షణం వారు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని శనివారం తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లు, కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
*ఇందిరలా నన్నూ చంపేస్తారు: కేజ్రీవాల్
భాజపా తనను ఏదో ఒక రోజు హతమారుస్తుందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని ఇందిరలాగే తనను కూడా వ్యక్తిగత భద్రతా అధికారే చంపేస్తారన్నారు. ఇటీవల దిల్లీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దాడి చేసింది ఆప్ కార్యకర్తేనని పోలీసులు ప్రకటించారు. దీనిపై శనివారం పంజాబ్‌లో ఓ ఛానల్‌తో కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘నేను హత్యకు గురైనా మాపై వ్యతిరేకత ఉన్న ఆప్ కార్యకర్తలే ఈ పని చేశారని పోలీసులు చెబుతారు.
*నియోజకవర్గ కేంద్రాల్లో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాలు
దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించడానికి టీపీసీసీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రాజీవ్ వర్ధంతి నిర్వహించాలని ఆదేశిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాశారు. ప్రధాని మోదీ, భాజపా నేతలు ఈ మధ్యకాలంలో పలుమార్లు రాజీవ్‌గాంధీపై ఆరోపణలు, విమర్శలు చేసిన నేపథ్యంలో వాటికి బదులు చెప్పాలని టీపీసీసీ నిర్ణయించింది. రాజీవ్ దేశాభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తూ కరపత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
*ప్రశ్నలు లేని విలేకరుల సమావేశమా: విపక్షాలు
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న తొలి విలేకరుల సమావేశం జరిగిన తీరుపై విపక్షాలు ఎద్దేవా చేశాయి. ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వకుండా ఈ సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపట్టాయి. ఇది విలేకరుల సమావేశంలా లేదని, రేడియోలో కాకుండా టీవీలో ప్రచారం చేసిన చివరి మన్ కీ బాత్‌లా ఉందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘పాపం! విలేకరులు!! ప్రశ్నలు పట్టుకొని క్రమశిక్షణగల సైనికుల్లా నిశ్శబ్దంగా ఉండిపోయారు’ అంటూ ట్వీట్ చేశారు.
*మోదీ చేతిలో కీలుబొమ్మలా ఈసీ: వైవీబీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా కోరినా పట్టించుకోని ఈసీ, వైకాపా కోరిన వెంటనే స్పందించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. శనివారం ఉండవల్లిలో రాజేంద్రప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తనకు సంబంధం లేని విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ అండదండలతో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో తెదేపా గెలుపు ఏకపక్షమేనని ధీమా వ్యక్తంచేశారు.
*కేవీపీ జగన్ కోవర్టు: హిదాయత్
ఎంపీ కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ ముసుగుతో భాజపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ హిదాయత్ ధ్వజమెత్తారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కోవర్టులా పనిచేస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉండవల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ సూచనతోనే కేవీపీ పోలవరం నిర్మాణంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
*విజయం గాంధీ వారసులదే: తులసిరెడ్డి
ప్రస్తుత ఎన్నికల్లో పోరు గాంధీ, గాడ్సే వారసుల మధ్యేనని.. అంతిమ విజయం గాంధీ వారసులదేనని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. గాంధీని చంపిన గాడ్సేని దేశభక్తునిగా భాజపా ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ అభివర్ణించడం దారుణమని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ నెల 23వ తేదీ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న మాయావతి-రాజకీయ-05/20
Related tags :