సౌత్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ లిస్ట్‌లో ప్రేక్షకుల చేత పేరు రాయించుకున్నారు రకుల్‌ప్రీత్ సింగ్. కానీ నార్త్‌లో మాత్రం కాస్త స్లో అయ్యారు. తాజాగా ఆమె నటించిన ‘దే దే ప్యార్ దే’ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. టబు మరో హీరోయిన్. ‘మీ కెరీర్‌లో తొలి హిందీ చిత్రం ‘యారియాన్’ (2014)కు మంచి స్పందన వచ్చినప్పటికీ మీరు నెక్ట్స్ హిందీ చిత్రం చేయడానికి నాలుగేళ్లు పట్టింది. ఇందుకు కారణం ఏంటి?’ అని రకుల్‌ని అడిగితే… ‘‘నిజానికి ‘యారియన్’ సినిమా కంటే ముందే తెలుగులో నాకో అవకాశం వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మంచి పేరొచ్చింది.ఆ తర్వాత సౌత్‌లో నాకు మంచి అవకాశాలు వచ్చాయి. అందుకే హిందీ వైపు వెళ్లలేదు. కథాబలం ఉన్న సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు హిందీ సినిమాలు చేయాలనుకున్నాను. ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాను. ఇప్పుడైతే భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ వస్తే అక్కడ చేయాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు రకుల్. హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన రకుల్ చేసిన ‘మర్జావాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘మన్మథుడు 2’తో చేస్తున్నారు. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
భాష కాదు భావం
Related tags :