ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడి ప్రభావం పిల్లలపై పడితే వాళ్ల చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, చెమటకాయలు… ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.
వేసవి అయినా సరే… రెండుపూటలా గోరువెచ్చని నీటితోనే వాళ్లకు స్నానం చేయించాలి. చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తోంటే… తువాలును చల్లటి నీటిలో ముంచి దాంతో ఆ ప్రాంతాన్ని తుడిచి ఆరాక పౌడరు రాయాలి.
* చిన్నారుల చర్మం ఎండకు కందిపోయినట్లు అయ్యిందా… తాజా కలబంద గుజ్జును ఆ భాగంలో రోజులో రెండుమూడుసార్లు రాస్తే ఉపశమనం కలుగుతుంది.
* ఒక వస్త్రంలో ఐసు ముక్కలను చుట్టి దాంతో కమిలిన చోట మృదువుగా రాయాలి. సమస్య అదుపులోకి వచ్చి హాయిగా అనిపిస్తుంది.
* కమిలిన ప్రాంతంలో నూనె రాయకూడదు. ఇది స్వేద గ్రంథులు మూసుకుపోయేలా చేస్తుంది.
* గంధం పొడిలో నీళ్లు కలిపి కమిలిన చర్మంపై పూతలా వేయాలి. ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది.
* ఈ కాలంలో చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూడాలి. నీళ్లతోపాటు నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరినీళ్లు ఇవ్వాలి.
* ఎండలో చిన్నారులను బయటకు పంపకూడదు. అలాగే ఉష్ణోగ్రత పెరిగాక వ్యాయామాల్లాంటివి చేయనివ్వకుండా చూడటం మంచిది.
ఎండాకాలం చిన్నారుల చర్మ సంరక్షణ ఇలా…
Related tags :