తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీ పదిహేనుకు పైగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇండియా టుడే, యాక్సిస్ మైఇండియా సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మాత్రం టీఆర్ఎస్ తొమ్మిది సీట్లు వస్తాయని మహా అయితే ఇంకో సీటు పెరుగుతుందని తమ ఫలితాలను వెల్లడించింది. ఏ స్థానంలో ఎవరికి విజయావకాశాలు ఉంటాయో వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం నిజామాబాద్‌లో కేసీఆర్ కుమార్తె కవితకు గెలుపు అంత సులువు కాదట. భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆమెకు గట్టి పోటీ ఇచ్చారని భాజపా అభ్యర్ధికే విజయావకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుస్తున్నారట. నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ లో భాజపా అభ్యర్ధులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కంచుకోటగా నిలిచినా ఖమ్మం జిల్లాలో ఈసారి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి పరాజయం పాలవుతున్నారట. తెదేపా నుండి తెరాసాలోకి దూకిన నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా జాక్ పాట్ కొట్టబోతున్నారు.మల్కాజ్ గిరి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఈసారి గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయాడట. హైదరాబాద్ లో అందరు అనుకున్నట్లుగానే మజ్లీస్ అభ్యర్ధి గెలుస్తున్నారు. ఆసక్తికరమైన ఈ సర్వే రిపోర్టును ఓసారి పరిశీలించండి.
నిజామాబాద్‌లో కవితక్క గెలుపు కష్టమేనట!–TNI ప్రత్యేకం
Related tags :