* పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేసిన మహిళను అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్పల్లిలో ఉండే యూనిస్లాల్నున్మావిచౌగ్నత్తు(35) అనే మహిళ సోమవారం మల్లాపూర్వద్ద అయాన్డిజిటల్జోన్లో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చింది.
* విజయనగరంజిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. పంటల పొలాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడమే కాకుండా ఒక రైతును హతమార్చాయి. జియమ్మవలస మండలం పెద్దకుదుమలో అరటి తోటలపై పడిన ఏనుగుల గుంపు ఆ తోటలను ధ్వంసం చేశాయి. ఈ ఏనుగుల దాడిలో కాసన్నదొర అనే రైతు మృతి చెందాడు.
* బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ) సంఘానికి ఎన్నికలు అక్టోబర్ 22న జరగనున్నాయి. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ఈ విషయాన్ని తెలియజేశారు. గత రెండు ఏళ్ల నుంచి సీఓఏ ఆధ్వర్యంలోనే క్రికెట్ బోర్డు నిర్వహణ జరుగుతున్నది. సుప్రీం కోర్టు సీఓఏను నియమించిన విషయం తెలిసిందే. దానికి ప్రస్తుతం వినోద్ రాయ్ చీఫ్‌గా ఉన్నారు. డయానా ఎడుల్‌జీ, లెఫ్టినెంట్ జనరల్ రవి తోగ్డేలు సభ్యులుగా ఉన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సభ్యులతో బీసీసీఐ బోర్డు నిర్వహణ జరుగుందన్న నమ్మకాన్ని పీఎస్ నర్సింహా కమిటీ వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాలతో చర్చలు జరిగిన తర్వాత నర్సింహా తన రిపోర్ట్ ను సమర్పించారు.
* సిద్దిపేట పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. కోమటి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టడానికి మంగళవారం చెరువుకు వెళ్లిన చిన్నారులు లక్ష్మణ్(10), గణేష్(15)లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తుదిశ్వాస విడిచారు. అప్పటి వరకు ఆడుతూ తమ ముందే తిరిగిన పిల్లలు విగత జీవులుగా మారడంతో ఆ చిన్నారుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
*దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మగిసినప్పటికీ బెంగాల్‌లో మాత్రం హింసా ఆగలేదు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో కూచ్ బిహార్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కర్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. అక్కడి ప్రాంతం ఉద్రిక్తంగా మారడంతో బందోబస్త్ ఏర్పాటు చేశారు.
* ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) అనుమానిత ఉగ్రవాదులు అరుణాచల్ ప్రదేశ్‌లో కలకలం సృష్టించారు. ఓ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిని కాల్చి చంపారు. వారిలో ఇద్దరు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. తిరాప్ జిల్లాలోని బొగాపాని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖోన్సా పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎన్‌పీపీ తరఫున మరోసారి పోటీ చేసిన తిరోంగ్ అబో.. మంగళవారం అసోం నుంచి తన నియోజక వర్గంలోని ఓ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి జరిపారు.
*హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇవాళ వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
* పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా వారిపై దాడి చేసిన మహిళను అరెస్ట్ చేశారు. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పర్పల్లిలో ఉండే యూనిస్లాల్నున్మావిచౌగ్నత్తు(35) అనే మహిళ సోమవారం మల్లాపూర్వద్ద అయాన్డిజిటల్జోన్లో జరుగుతున్న పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చింది.
* తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది ఓ ప్రేమ జంట. కడప జిల్లా వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్ పై ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రమేష్ బాబు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. రమేష్ కు వేరే అమ్మాయితో పెళ్లి కుదిర్చారు వాళ్ల పెద్దలు. అయితే పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోవడం లేదని మనస్థాపం చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
*మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,. ఓ టెంపో పైకి ట్రక్కు దూసుకెళ్లడంతో పదమూడు మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మల్కాపూర్ దగ్గర ముంబై- నాగపూర్ హైవే పై సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది.
*చిత్తూరు నగర శివారులో స్ట్రాంగ్‌రూమ్‌ను ఏర్పాటు చేసిన ఎస్వీసెట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బందోబస్తుగా ఉన్న సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
* విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లను సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తి 600 గ్రాముల బంగారం దాచుకొని బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అనుమానంతో భద్రతా సిబ్బంది అతడి సామగ్రిని తనిఖీ చేయడంతో, గుట్టు రట్టయింది. స్వాధీనం చేసుకున్న స్వర్ణం విలువ రూ.19.18 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
*విశాఖ నగరంలోని తూర్పు నావికాదళ ఉద్యోగుల నివాస ప్రాంతం అమ్జారీ పార్కులో సోమవారం ఓ కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందాడు.
*మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బామ్రాగడ్ తాలూకా కోటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాపసీ అటవీ ప్రాంత పరిధిలో పోలీసులు, మావోయిస్ట్టులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
*కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటులు సైఫ్ ఆలీఖాన్ సోనాలి బింద్రే టబు, నీలం కోరాటీలకు హైకోర్టు నోటీసులు జరీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టకు చెందిన జోద్ పూర్ బెంచ్ సోమవారం నోటీసులు జారీ చేసింది.
*అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి రూ.5 వేల కోట్లకు పైగా డిపాజిట్లు వసూలు చేసిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత నౌహీరా షేక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట నోరు మెదపడంలేదు.
*బాహ్య వలయ రహదారి(ఔటర్)పై అర్ధరాత్రి ఓ డీసీఎం వ్యాన్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. కాగా డ్రైవర్ మృతదేహం ఘటనా స్థలం నుంచి 3 కి.మీ దూరంలో రోడ్డు పక్కన పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
*పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హఠాన్మరణం చెందారు. ఇంటి యజమాని పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం రాజపూర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
*విశాఖ జిల్లా పెదబయిలు మండలం చిత్రకాయపుట్టులో విషాదం చోటుచేసుకుంది. జీలుగు కల్లు తాగి ఇద్దరు మృతిచెందారు.
*వికారాబాద్ జిల్లా ధారూర్‌లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఈ హత్యకేసులో అరెస్టైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లను పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు సోమవారం హాజరుపరిచారు.
*గుర్తుతెలియని వ్యక్తి మా చరవాణిని చోరీ చేశాడు.. అతన్ని పట్టుకుంటామంటూ ఇద్దరు యువకులు ఓ ద్విచక్రవాహనం, చరవాణితో ఉడాయించిన సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధి ఫాతిమాపూరు పుణ్యక్షేత్రంలో సోమవారం చోటుచేసుకుంది.
*తమిళనాడులో దారుణం జరిగింది. చదవకుండా టీవీ చూస్తోందని కన్న కూతురిని ఆ తల్లి దారుణంగా కొట్టి చంపింది. తిరుచ్చి జిల్లా కాట్టుపుదూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిత్యకమల.. తన ఐదేళ్ల కుమార్తె లతికా శ్రీని చదవడంలేదని దారుణంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* స్నేహితులతో సరదాగా విహార యాత్రకని వచ్చిన ఓ విద్యార్థి సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణా జిల్లా హంసల దీవి సమీపాన సాగరసంగమం వద్ద సోమవారం చోటుచేసుకుంది.
*తాగునీరు కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కర్నూలు జిల్లాలో జరిగిన ఉదంతం అద్దం పడుతోంది. కొళాయి వద్ద తాగునీరు పట్టుకునే విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ ప్రాణాలు బలితీసుకుంది. ఈఘటన కర్నులు జిల్లాలో కలకలం రేపింది.
*ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం పట్టపగలే నడిరోడ్డుపై 40 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బబ్లూ దూపేయి అలియాస్ చోటీ అనే వ్యక్తి రహదారి పక్కన నిలబడి ఉన్న సమయంలో ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.
*మహారాష్ట్రలోని మల్కాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 6వ నంబరు జాతీయ రహదారిపై భారీ కంటైనర్ ..మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
*గాంధారి మండలం లోని రాంపూర్‌లో మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్రామానికి చెందిన దస్తగిరి లింగం అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన 17 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.25 వేలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎఫ్‌ఆర్‌వో అనురాధ, ఫారెస్ట్ సెక్షన్ అధికారి స్రవంతితో పాటు బీట్ అధికారులు పాల్గొన్నారు.
*హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇవాళ వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
* అశ్వారావుపేట పట్టణంలో పట్టపగలే దొంగలు చోరీకి తెగబడ్డారు. గత ఏడాది అక్టోబరు 27న దారుణ హత్యకు గురైన మడుపు పాపాచారి ఇంట్లోకి సోమవారం పట్టపగలే దొంగలు ప్రవేశించారు.
పోలీసును కొట్టిన మహిళ-నేరవార్తలు–05/21
Related tags :