DailyDose

చంద్రబాబుకి చెయ్యిచ్చిన స్వామి-రాజకీయ-05/21

May 21 2019 - Daily Political News- Chandrababu Kumaraswamy - tnilive telugu political news

*ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ తగిలింది. మొన్నటి వరకు బాబు వెంట నేను అన్నట్లు ఉన్న కన్నడ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ డిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశమయ్యాయి. అయితే ఈ సమావేశానికి కుమారస్వామి డుమ్మాకోట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపద్యంలో కుమారస్వామి డిల్లి పర్యతనాను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్నీ జేడీఎస్ వర్గాలు తెలిపాయి. డిల్లి పర్యటనకు కుమారస్వామి వెళ్ళడం లేదని ఇదే విషయన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా వెల్లడించింది.
*కౌంటింగ్ తరువాత కూడా రీపోలింగ్
* దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటింగ్‌ పూర్తైన తర్వాత కూడా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈవీఎంలు మొరాయించి, వీవీప్యాట్‌ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇక మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.
*ఈసీ పనితీరు భేష్
కేంద్ర ఎన్నికల సంఘం పై మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముకర్జి ప్రసంసల జల్లు కురిపించారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీని కొనియాడారు. విపక్షాల్ ఎన్నికల సంఘాన్ని విమర్సిన్చావద్దని ప్రణబ్ హితవుపలికారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తోలి ఎన్నికల కమిషన్ సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుత కమిశానర్ల్.అ వరక.ఉ ప.రాతి. ఓ.కే.క.ఋ కే.ఈల.క. ప.త.ర పోషించారన్నారు. ప్రజాస్వామ్యనికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, అవన్నీ బాగా పని చేస్తున్నాయని ప్రశంసించారు.
*వంద శాతం వీవీ ప్యాట్లు లెక్కింపు – సుప్రీంలో చుక్కెదురు
వంద శాతం వీవీ ప్యాట్లు లేక్కించాలన్న డిమాండ్ కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో చుక్కెదురైంది. వందశాతం వీవీప్యాట్లను లేక్కించాలని దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. టెక్నోపార్ ఆఫ్ అనే సంస్థ అఖలు చేసిన ఈ పిటిషన్ లో ఎలాంటి మెరిట్ లేదని వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యుసేన్స్ పిటిషన్ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకుల మంగళవారం డిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీ ప్యాట్లనే నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది.
* ఎన్డీయేతర పక్షాల నేతల సమావేశం ప్రారంభం
కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న పక్షపాత ధోరణిపై చర్చించేందుకు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 19 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ గెహ్లోత్‌‌, అభిషేక్‌ మను సింఘ్వీ, ఆప్‌ నుంచి దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేత సంజయ్‌సింగ్‌, తెదేపా నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే నేత కణిమొళి, ఆర్జేడీ నేత మనోజ్‌ ఝూ, ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌ పటేల్‌, ఎస్పీ నుంచి రామ్‌కృపాల్‌ యాదవ్‌, టీఎంసీ నుంచి డెరెక్‌ ఒబ్రెయిన్‌, బీఎస్పీ నుంచి సతీశ్‌చంద్ర మిశ్రా, ఎస్పీ నుంచి దేవేందర్‌రాణా తదితరులు హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత నేతలంతా ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.
*వారి ద్రుష్టి అంతా మూడు రాష్ట్రాల పైనే..
ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే దూకుడుకు రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి. భాజపా జాతీయ అద్యక్షుడు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోడీ సెలెక్టివ్ గా కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టడమే ప్రధాన కారణమని రాజాగా తెర మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ ఒడిశాల పై మోడీ-షా జోడీ ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టిందని పోల్ ఏనాలిప్తులు చెప్పారు. 2014ఎలక్షన్స్ లో భాజపా దూకుడుకు బ్రేక్ వేయడానికి అఖిలేష్ యాదవ్ మాయావతి నాయకత్వంలో ఓ బలమైన కూటమి ఏర్పడింది. మొదట్లో కేవలం సమాజ్ వాడీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలే ఇందులో ఉన్నాయి.
*ఆరెస్సెస్‌ నేతతో గడ్కరీ భేటీ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఆరెస్సెస్‌ నేత భయ్యాజి జోషీతో సమావేశమయ్యారు. ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే ఈ భేటీ జరగడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని గడ్కరీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తదుపరి ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర గురించి ఇరువురు చర్చించారని, ఆయనకు కీలక పదవి దక్కేలా చూస్తామని ఆరెస్సెస్‌ నేత హామీ ఇచ్చినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
*బాధ కలిగింఛి ఉంటె క్షమించండి – ప్రజ్ఞా
ఈ ఎన్నికల సమయంలో తన మతాల ద్వార ఎవరికైనా బాధ కలిగి ఉంటె అందుకు తానూ క్షామంతుర్యురాలినని భాజపా నాయకురాలు సాద్వీ ప్రజ్ఞా సింగ్ టాకూర్ సోమవారం పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రీయ పరిసమప్తమైనది ఇప్పుడిక ఇది అవలోకనం చేసుకోవలసిన సమయం. అందుకే ప్రాయశ్చిత్తంగా తానూ 63 గంటల పటు మౌన దీక్ష వహించనున్నట్లు ఆమె ట్విట్ చేశారు.
*నమో టీవీలో ప్రసారాలు బంద్‌
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలను, ప్రసంగాలను విస్తృతంగా ప్రచారం చేసిన భాజపా ఆధ్వర్యంలోని నమో టీవీ తన ప్రసారాలను నిలిపివేసింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు ముగిసిన మే 17 నుంచి అది మూగబోయిందని భాజపా వర్గాలు తెలిపాయి. నిజానికి తాజా ఎన్నికల్లో ప్రచారం కోసమే ఈ టీవీని స్థాపించినట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఇక దాని అవసరం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందే నమో టీవీ ప్రారంభమైంది. అందులోని ప్రసారాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రచార గడువు ముగిశాక కూడా ఎన్నికల సంబంధ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై దిల్లీలో ముఖ్య ఎన్నికల అధికారి ఆ ఛానల్‌కు నోటీసు పంపారు. అయితే తాము ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని ఆ ఛానల్‌ స్పష్టంచేసింది.
*యూపీ మంత్రి రాజ్‌భర్‌ తొలగింపు
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన మంత్రి మండలి నుంచి సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌కు ఉద్వాసన పలికారు. రాజ్‌భర్‌ను మంత్రిమండలి నుంచి తొలగించాలంటూ సోమవారం సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్‌ వెంటనే ఆమోదం తెలిపారు.
*మధ్యప్రదేశ్‌లో బలనిరూపణ చేసుకోండి
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమికి అత్యధిక స్థానాలు దక్కనున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించిన మరుసటి రోజే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రాష్ట్ర భాజపా నేతలు గురిపెట్టారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధపడాలని ఇక్కడి కమల్‌నాథ్‌ సర్కారును డిమాండ్‌ చేశారు. రైతులకు రుణమాఫీ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి, కాంగ్రెస్‌ ప్రభుత్వ బలాన్ని పరీక్షించడానికి శాసన సభను త్వరలో ప్రత్యేకంగా సమావేశపరచాలని గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌కు లేఖ రాయనున్నట్లు విపక్ష నేత గోపాల భార్గవ తెలిపారు.
*చంద్రగిరిలో పీవోలు, ఏపీవోలపై సస్పెన్షన్‌ వేటు
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరించిన పలువురు ఎన్నికల అధికారులను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఐదు పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ప్రిసైడింగ్‌ అధికారులతో(పీవో) పాటు సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు(ఏపీవో) సస్పెన్షన్‌కు గురయ్యారు.
*రాష్ట్రంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఇక కనుమరుగు
భాజపా కార్యకర్తలు పోరాడటంతో పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు తుడిచిపెట్టుకుని పోయాయని, తెలంగాణలో కూడా ఆ పరిస్థితులు పునరావృతం కానున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగవుతాయని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెరాస ధాటికి తట్టుకోలేక పలువురు ఇతర పార్టీల వారు గులాబీ కండువాలు కప్పుకుంటున్న నేపథ్యంలో, తెరాస నిరంకుశత్వాన్ని ఎదుర్కొనే సత్తా కేవలం భాజపాకు మాత్రమే ఉందని తెలిపారు.
*మాయావతి, అఖిలేశ్‌ భేటీ
బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సోమవారం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్‌తో సమావేశమైనారు. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమికి మెరుగైన అవకాశాలంటూ ఎగ్జిట్‌పోల్స్‌ సూచించిన నేపథ్యంలో వీరిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం మాయావతి నివాసానికి వెళ్లారు. ఉభయుల మధ్యా దాదాపు గంటపాటు చర్చలు జరిగాయి. అయితే, చర్చల వివరాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు. ఈ దఫా లోక్‌సభలో ఎన్‌డీఏకు 300 పై చిలుకు స్థానాలు లభిస్తాయంటూ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేసిన విషయం గమనార్హం. కాగా, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు శనివారం అఖిలేష్‌ యాదవ్‌, మాయవతిలతో లఖ్‌నవూలో విడివిడిగా సమావేశమైన విషయం తెలిసిందే.
*హాజీపూర్‌ బాధితులను కేటీఆర్‌ పరామర్శించాలి
హాజీపూర్‌ బాధిత కుటుంబాలను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరామర్శించాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు కోరారు. ఘటన వెలుగులోకి వచ్చిన 25 రోజుల తర్వాత దీనిపై కేటీఆర్‌ స్పందించడం సరికాదన్నారు. సోమవారం గాంధీభవన్‌లో వీహెచ్‌ విలేకరులతో మాట్లాడారు. న్యాయం కోసం హాజీపూర్‌లో దీక్ష చేస్తున్న వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నారు. వెంటనే వారందరిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని ఆయన తండ్రి కూడా కోరుకుంటున్నారన్నారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 3 నుంచి 4 ఎంపీ సీట్లు వస్తాయని వీహెచ్‌ పేర్కొన్నారు.
*యూపీ మంత్రి రాజ్‌భర్‌ తొలగింపు
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన మంత్రి మండలి నుంచి సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌కు ఉద్వాసన పలికారు. రాజ్‌భర్‌ను మంత్రిమండలి నుంచి తొలగించాలంటూ సోమవారం సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్‌ వెంటనే ఆమోదం తెలిపారు. తనను 20 రోజుల క్రితమే మంత్రి మండలి నుంచి తొలగించి ఉంటే బాగుండేదని రాజ్‌భర్‌ స్పందించారు.
*ప్రజా తీర్పుపైనే విశ్వాసం: స్టాలిన్‌
ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు తమ పార్టీకి అనుకూలంగా వచ్చినా వాటిపై నమ్మకం లేదని.. ప్రజలు ఇచ్చే తీర్పుపైనే విశ్వాసం ఉంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో తమిళనాట డీఎంకే- కాంగ్రెస్‌ కూటమి ఎక్కువ స్థానాలు సాధిస్తుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టాలిన్‌ మాట్లాడుతూ…ఎగ్జిట్‌ పోల్స్‌ను అంతగా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వంలోనైనా మంత్రి పదవులు తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. ఇలాంటి వాటికి 23వ తేదీ తర్వాతే సమాధానం దొరుకుతుందన్నారు.
*చంద్రగిరిలో పీవోలు, ఏపీవోలపై సస్పెన్షన్‌ వేటు
సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నా.. చూసీచూడనట్లు వ్యవహరించిన పలువురు ఎన్నికల అధికారులను సస్పెండ్‌ చేశారు. 5 పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని ప్రిసైడింగ్‌ అధికారులతో (పీవో) పాటు సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీవో) సస్పెన్షన్‌కు గురయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ సమయంలో అక్రమాలు జరిగాయంటూ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని, వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తొలుత వైకాపా అభ్యర్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీలను తెప్పించుకుని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని నిర్ధరించుకుని రీపోలింగ్‌కు ఆదేశించింది.
*లెక్కింపు కేంద్రాల్లో భద్రత పెంచండి
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌అరోడాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కౌంటింగ్‌ ప్రక్రియకు విఘాతం కలిగించేలా వైకాపా కార్యకర్తలు యత్నించొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
*తెదేపాదే అధికారం: బుద్ధా వెంకన్న
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకొచ్చేది తెదేపాయేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తంచేశారు. భాజపా, వైకాపాలకు అనుకూలంగా విడుదల చేసిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ ప్రధాని మోదీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. సోమవారం ఉండవల్లిలో బుద్ధా వెంకన్న విలేకరులతో మాట్లాడారు. జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ బూటకమేనని మండిపడ్డారు.
*భాజపాకు ఎవరి సహకారం అవసరంలేదు: విష్ణుకుమార్‌రాజు
కేంద్రంలో ఎవరి సహకారం అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు భాజపాకు వస్తాయని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. సోమవారమిక్కడ ఆయన మాట్లాడుతూ… భాజపాకు ఒంటరిగానే 280పైగా సీట్లు వస్తాయన్నారు. ప్రతిపక్షాలు అందరినీ కూడగట్టాలని 15 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు వృథా అవుతాయని పరోక్షంగా సీఎం చంద్రబాబుని విమర్శించారు.
*లెక్కింపు కేంద్రాల్లో భద్రత పెంచండి
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారమిక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌అరోడాను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కౌంటింగ్‌ ప్రక్రియకు విఘాతం కలిగించేలా వైకాపా కార్యకర్తలు యత్నించొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు పారదర్శకతతో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
*మళ్ళీ మాదే విజయం – తృణముల్
ఎగ్జిట్ పోల్స్ ను వడంతులుగా కొట్టి పారేసిన తృణముల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ లో ఈసారి కూడా తమదే విజయమని సోమవారం పేర్కొంది. ప్రతి నియోజకవర్గం నుంచి అంతర్గత నివేదికలు తెప్పించుకున్నామని వాటిలో స్పష్టమైన విజయం తీఎంసిదేనని తేలినట్లు వెల్లడించింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తామే కీలక పాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పార్టీ అధినాయకురాలు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జి తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో యూపీ, మహారాస్త్రాల తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాలున్నా పశ్చిమ బెంగాల్ లో ఈసారి టీఎంసీకి 34, భాజపా కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. కాగా తాజా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తామేమీ ఆందోళన చెందడం లేదని చాలా సందర్భాల్లో ఇవి వాస్తవాలకు విరుద్దంగా వచ్చినట్లు టీఎంసి సెక్రటరి జనరల్ పార్ధ చటర్జీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం పరిస్థితుల పై తాము తెదేపా, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ , ఆప్ తదితర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఎంసి సీనియర్ నేత ఒకరు తెలిపారు. తమ అంచనాల ప్రకారం ప్రతిపక్షాలే అధికారంలోకి వస్తాయని భాజపా తిరిగి పగ్గాలు చేపట్టడం కష్టమేనని అభిప్రాయపడ్డారు.
*భాజపాలో ఉత్సాహం.. ఆప్ లో నిర్వేదం..
దేశం రాజధాని డిల్లీలో ఏడూ లోక్ సభ స్థానాలనూ భాజపా క్లీన్ చీట్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన నేపద్యంలో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ పై ఖచ్చితంగా పని చేస్తుందా? ఎగ్జిట్ పోల్స్ ను స్పాన్సర్ చేశారా? యుపీ, బీహార్, రాజస్తాన్, చత్తీష్ ఘడ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, డిల్లి బెంగాల్ లో భాజపా గెలుస్తుందంతున్నారు. ఎవరు నమ్ముతారు వీటిని? వీవీప్యాట్, ఈవీఎంలలో తేడాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను రద్దు చేయాలనీ అన్ని పార్టీలు డిమాండు చేయాలి. అని సింగ్ ట్విట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఈనెల 23న వెలువడే వస్తావా ఫలితాల్లోనూ ప్రతిఫలించాలని డిల్లి భాజపా అద్యక్షుడు మనోజ్ తివారీ ఆకాంక్ష చేశారు.