Health

30ఏళ్లు దాటిన బుజ్జికొండలందరూ తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి!

Telugu Health - Anyone Above 30 Years Must Get Checked Without Fail - TNILIVE

నారాయణ హృదయాలయ, బెంగుళూరు
హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దేవి శెట్టి గారు
విప్రో ఉద్యోగులకు ఇచ్చిన సలహాలు:

ప్రశ్న 1 : గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ?
జవాబు : 1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనె.
2)వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం
3)ధూమ పానం మానడం.
4)బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.
5)బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.

ప్రశ్న 2. కొవ్వును కండగా మార్చుకొగలమా ?
జవాబు : ఇది ఒక ప్రమాదకరమైన అపోహ ! కొవ్వు – కండ ఈ రెండూ వేరు వేరు కణజాలాలు.కొవ్వు అసహ్యకరం ప్రమాదకరం. కొవ్వు కండగా మారదు.

ప్రశ్న 3 : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు. అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

ప్రశ్న 4 : గుండె పోటు వంశ పారం పర్యమా?
జవాబు : అవును

ప్రశ్న 5 : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది? ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? ( స్ట్రెస్ )
జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి. ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.

ప్రశ్న6 : ఆరోగ్యవంతమైన గుండె కోసం జాగింగ్,నడక రెండింటిలో ఏది ఉత్తమం?
జవాబు : నడక మంచిది. జాగింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.

ప్రశ్న 7: మీరు పేదలకు , అవుసరమైన వారికీ సేవ చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు?
జవాబు : మదర్ తెరెసా!

ప్రశ్న 8: లో (low) బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఉందా ?
జవాబు : చాలా తక్కువ.

ప్రశ్న 9 : కొలెస్టరాల్ బాల్యం నుండే పోగుపడుతూ వస్తుందా? (నా వయసు 22). 30 సంవత్సరాల తర్వాత మాత్రమె దాని గురించి వర్రీ అవ్వాలా?
జవాబు : చిన్నతనం నుండే పేరుకుంటూ వస్తుంది.

ప్రశ్న 10 : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా?
జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు. ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి.

ప్రశ్న 11: మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?
జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా.

ప్రశ్న 12: గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది?చెడ్డ ఆహారం ఏది?
జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి. నూనెలు చెడ్డవి.

ప్రశ్న 13: ఏ నూనె మంచిది ? సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె, ఆలివ్ ఆయిల్ ?
జవాబు : అన్ని నూనెలూ చెడ్డవే.

ప్రశ్న 14: ఏమేమి టెస్టులు చేయించుకోవాలి? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా?
జవాబు : రొటీన్ షుగర్, బి.పి,కొలెస్టరాల్ చాలు. ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.

ప్రశ్న 15 : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి?
జవాబు : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి. ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి. మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .

ప్రశ్న 16 : గ్యాస్ట్రిక్ నొప్పికీ – గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?
జవాబు : ఈ.సి.జీ చూస్తే గానీ చెప్పలేము.

ప్రశ్న 17: యువకులలో వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లో పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 – 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )
జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది. అందు వలన కేసులు కనిపిస్తున్నాయి. జీవన విధానం ( బద్ధకం ), జంక్ ఫుడ్, వ్యాయామం లేక పోవడం, పొగ తాగడం. మన దేశం లో జెనెటికల్ గా అమెరికా యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ.

ప్రశ్న 18 : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా?
జవాబు : ఉంటారు.

ప్రశ్న 19 : దగ్గర సంబంధాలు చేసుకోవడం వలన పిల్లలకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు. వాస్తవమా?
జవాబు : వాస్తవమే! దగ్గర సంబంధాల వలన కంజెనిటల్ ఎబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు పుట్టవచ్చు.

ప్రశ్న 20 : మాలో చాలా మందిమి ఒక క్రమ బద్ధమైన రొటీన్ గడపము నైట్ ఎక్కువ సేపు ఆఫీసు లో ఉంటాం. ఇది మా గుండె మీద ప్రభావం చూపుతుందా ?
జవాబు : మీరు యువకులుగా ఉన్నంత సేపూ మీ శరీర ప్రకృతి మిమ్మలి కాపాడుతుంది. ఇటువంటి అసంబద్ధ జీవిత విధానాల నుండి. కానీ పెద్దవారు మీ బైయోలాజికల్ క్లాక్ ని అనుసరించండి.

ప్రశ్న 21: ఆంటి హైపర్టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )
జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.

ప్రశ్న 22 : కాఫీ/టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా?
జవాబు : లేదు.

ప్రశ్న 23 : ఆస్థమా వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా ?
జవాబు : లేదు

ప్రశ్న 24 : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి?
జవాబు : వేపుళ్ళు — ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.

ప్రశ్న 25 : భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా!
జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది (అనుకూలత ఉంటుంది) దురదృష్టవశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది.

ప్రశ్న 26 : అరటి పళ్ళు తింటే గుండె జబ్బు తగ్గుతుందా ?
జవాబు : నో.

ప్రశ్న 27 : గుండె జబ్బు వచ్చిన వ్యక్తి తనకు తనే ఏదైనా చేసుకోవచ్చా?
జవాబు : వెల్లకిలా పడుకోవాలి. నాలుక కింద ఏదైనా బ్రాండ్ ఒక ఆస్ప్రిన్ మాత్ర పెట్టుకుని , అంబులెన్స్ వచ్చే వరకూ వేచి చూడకుండా దగ్గరలోని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అంబులెన్స్ రావడం త్వరగా జరగదు.

ప్రశ్న 28 : లో వైట్ బ్లడ్ సెల్స్ (తక్కువ తెల్ల రక్త కణాలు), హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా?
జవాబు : కావు. కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.

ప్రశ్న 29 : మా బిజీ షెడ్యుల్ వలన మేము ఎక్సర్‌సైజ్ చెయ్యడానికి టైం ఉండదు. ఇంట్లో నడవడం, మేడ మెట్లు ఎక్కడం వంటివి కూడా ఎక్సర్సైజ్ గా అనుకోవచ్చా?
జవాబు : తప్పకుండా ! ఒకే కుర్చీలో అరగంట కంటే ఎక్కువ కూర్చోకుండా ఈ కుర్చీ లో నుండి ఇంకో కుర్చీ లోకి మారి కూర్చోవడం కూడా చెయ్యవచ్చు.

ప్రశ్న 30 : షుగరుకూ, గుండె జబ్బులకూ సంబధం ఉందా?
జవాబు : ఉంది. షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ.

ప్రశ్న 31 : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జవాబు : ఆహారం, ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బిపీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.

ప్రశ్న 32 : రాత్రి షిఫ్ట్ లో పని చేసే వారికి, డే షిఫ్ట్ వారికంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?
జవాబు : నో .

ప్రశ్న 33 : Anti-hypertensive డ్రగ్స్ ఏమిటి?
జవాబు : కొన్ని వందలు ఉన్నాయి . మీకు అనుకూలమైనది మీ డాక్టర్ ఎంపిక చేసి చెబుతారు. కానీ నా సలహా మందుల కన్నా ప్రాకృతిక విధానం లో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోవడం (నడక). ఆహారం విషయం లో జీవిత వైఖరులలో మార్పు తెచ్చుకోవడం.

ప్రశ్న 34 : డిస్పిరిన్ లేదా ఏదైనా తలనొప్పి మాత్రలు గుండె జబ్బులకు దోహదం చేస్తాయా ?
జవాబు : నో

ప్రశ్న 35 : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?
జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది)

ఆఖరు ప్రశ్న : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
జవాబు : ఆరోగ్యవంతమైన ఆహారం తినండి. ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి. జంక్ ఫుడ్ తినకండి. స్మోకింగ్ మానండి. 30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి ( రికమెండేడ్ )