సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ గ్లాస్ 2 గ్లాసెస్‌కు గాను ఎంటర్ ప్రైజ్ ఎడిషన్ వేరియెంట్‌ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్1 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల డివైస్ ప్రదర్శన గత గ్లాస్ వేరియెంట్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. అలాగే కెమెరా ప్రదర్శన కూడా మెరుగ్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఈ గ్లాస్ వేరియెంట్‌లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ గ్లాస్‌కు యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఏర్పాటు చేశారు. ఇక గతంలో వచ్చిన గూగుల్ గ్లాస్ వేరియెంట్ల కన్నా గ్లాస్ 2 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్ వేరియెంట్ మరింత మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. కాగా ఈ కొత్త వేరియెంట్ 999 అమెరికన్ డాలర్ల ధరకు (దాదాపుగా రూ.69,660) కేవలం ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ యాజమాన్యాలకు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నది..!
The All New Google Glass 2.0 Is Out – Features & Specs
Related tags :