రాష్ట్ర సమాచార హక్కు కమీషనరుగా నియమితులైన విజయవాడ పట్టణ ప్రముఖులు ఐలాపురం రాజాను విజయవాడలోని వివిధ సామాజిక, సాంఘిక సేవా సంస్థల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నల్లూరి వెంకటేశ్వర్లు, కోగంటి సత్యం, శారద, పోలవరపు కోటేశ్వరరావు, వెన్నా వల్లభరావు, గుమ్మా సాంబశివరావు, ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి, జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీ.వీ.పూర్ణచంద్ తదితరులు ప్రసంగిస్తూ ఐలాపురం రాజా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించారు. రాజా తండ్రి ఐలాపురం వెంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడలో ఐలాపురం రాజాకు ఘనసత్కారం
Related tags :