కొత్తమీరతో కూరలకు మంచి రుచి వస్తుంది. అంతేకాదు, కొత్తిమీరను అలాగే నేరుగా కూరగా చేసుకున్నా, పచ్చడిగా చేసుకు తిన్నా బాగుంటుంది. మరి కొన్ని ప్రయోజనాలు దీంతో ఉన్నాయి. అజీర్తిని నివారించడంలో కొత్తిమీర చక్కగా పనిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను ఉదయాన్నే పరగడుపునే తాగితే జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తగ్గుతాయి.కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల శరీరం శుభ్రమవుతుంది. శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జ్వరం వచ్చిన వారు కొత్తిమీర జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్నిరకాల జ్వరాలను తగ్గిస్తాయి. జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి, కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర దోహదపడుతుంది. కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, బి1, బి2, సి లభిస్తాయి. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి.
కొత్తిమీరతో అజీర్తికి చెక్
Related tags :