Fashion

చెవిదిద్దుల్లో సరికొత్త సరళి

Ear Cuff Jewellery Is The Latest Trend In Womens Ear Rings Fashion - tnilive - చెవిదిద్దుల్లో సరికొత్త సరళి

ఎంతందంగా తయారైనా చెవులకు చమక్కుమనిపించే ఆభరణాల అలంకరణ లేకపోతే ఆకట్టుకోలేం. జుంకాలు, లోలాకులు లాంటివి ఎన్ని ఉన్నా…. చూపుతిప్పుకోనివ్వకుండా చేసే స్టేట్‌మెంట్‌ స్టైల్‌ ఉండాల్సిందే. అలాంటి రకాల్లో ఇయర్‌కఫ్‌ జ్యూయలరీది ప్రత్యేక స్థానం. చెవి అంతా అల్లుకుపోయే రకాల్లో నిన్నటివరకూ ఇవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చెవిపైనా కిందా ఒకే లాంటి ఆకృతితో, వేర్వేరు పరిమాణాల్లో సందడిచేస్తున్నాయివి. ఇప్పుడు అదే ట్రెండ్‌ కూడా. సంప్రదాయ దుస్తుల మీదకు చక్కని ఎంపిక.